పరిషత్ పోరులో.. గులాబీ దూకుడు

Wed,April 24, 2019 01:22 AM

-జెడ్పీపీఠం కైవసంచేసుకునేందుకుటీఆర్‌ఎస్ కృషి
-గ్రామస్థాయిలో పార్టీసమావేశాలు
-అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ
-సమర్థులకే గులాబీ టికెట్టు
-కార్యకర్తలతో విస్తృతసమావేశాలు నిర్వహిస్తున్నఎమ్మెల్యేలు బండ్ల, అబ్రహం
జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల నగారా మో గడంతో జిల్లాలోని ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలుపుతున్నారు. గ్రామాల్లో బ లమైన నాయకునిగా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, గ్రామ స మస్యలు పూర్తి గా తెలిసిన వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిపేందుకు గ్రామస్థాయిలో సమావేశాలు ని ర్వహిస్తున్నారు. గ్రామీణ, మండల స్థా యిలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల, సలహాదారుల ఆమోదం ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో నిలుపుతున్నారు. ఇందు కోసం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంలు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు గ్రామస్తులతో సుధీర్ఘ చర్చలు కొనసాగిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ప్రా రంభం కావడంతో మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తున్న గద్వాల, గట్టు, ధ రూర్, కేటీదొడ్డి మండలాల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు వే యిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోని 141 ఎంపీటీసీలను, 12 ఎంపీపీలను, 12 జెడ్పీటీసీలను సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాయశక్తులా కృషిచేస్తున్నారు.

మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బండ్ల
గద్వాల నియోజకవర్గ పరిధిలోని 4 మం డలాల్లో మొదటి విడత స్థానిక సంస్థల ఎ న్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే నోటీఫికేషన్ విడుదలైం ది.. అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మొదటి విడతలో గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో మొత్తం 54 ఎం పీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం లో రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మొదటి విడతలో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసే విష యంలో ఎ మ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్థానికంగా ఉండే టీఆర్‌ఎస్ నాయకుల అందిరి అభిప్రాయాలు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం మండలా ల్లో పర్యటిస్తూ గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించగలిగే టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఎంచుకోని స్థానిక సంస్థల బరిలో నిలుపుతున్నారు.

కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో మొత్తం 4 జెడ్పీటీసీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగు ను న్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నారు. ఈ రెండో విడత ఎన్నికలను మే 10న నిర్వహించనున్నారు. మూడో విడతలో అలంపూర్, ఇ టిక్యాల, ఉండవెల్లి, మానవపాడులో 4 జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగ నున్నాయి. ఈ ఎన్నికలను సంబంధించి ఈ నెల 30 నుంచి నామినేషన్లు స్వీక రించి మే 14న పోలింగ్ ని ర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల కు సంబంధిం ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం కార్యకర్తలతో సమావేశాలు ని ర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోని కార్యకర్తలను అభిప్రాయాలు సేకరించి నిర్ణ యం తీసుకోనున్నారు. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను ఎంచుకొని బరిలో నిలుపుతున్నారు.

ప్రాదేశిక ఎన్నికలకు కసరత్తు
- నామినేషన్ పత్రాలు సరి చేస్తున్న అధికార యంత్రాంగం
అయిజ : మండల ప్రాదేశిక, జడ్పీ ప్రాదేశిక ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు మే 10న జరుగనున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు పత్రాలను సిద్ధం చేస్తున్నారు. మండలంలో ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసి 16 ఎంపీటీసీలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఆర్‌వోలు నామినేషన్లను అక్కడే స్వీకరించనున్నారు. జడ్పీటీసీ నామినేషన్లను పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోనే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు హాజ రయ్యే ఆర్‌వోలకు అందజేయాల్సిన పత్రాలను మండల పరిషత్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న వేళ అభ్యర్థులకు అందజేయాల్సిన పత్రాలను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులకు తగు సూచనలు, సలహాలను అందించేందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఆర్‌వోలకు అందజేయనున్నారు. నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సాయిప్రకాశ్ పేర్కొన్నారు.
24న ఏఈవోలకు శిక్షణ
అయిజ రూరల్: రైతు సమగ్రసమాచార సేకరణకు సంబంధించి ఈ నెల 24న శిక్షణ కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి శంకర్‌లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను 24న జరగాల్సిన సర్వేను 25న ఏఈవోలు చేపడుతారని చెప్పారు. 25న సర్వే జరగబోయే గ్రామాలు పులికల్, ఎక్లాస్‌పురం, చిన్న తాండ్రపాడు, సంకాపురం, మేడికొండ, తుప్పత్రాల, వెంకటాపురం, కుట్కనూరు, ఉప్పల, యాపదిన్నెలు ఉన్నాయని, ఆయా గ్రామాల రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ కాఫీలు, బ్యాంకు ఖాతాతో సిధంగా ఉం డాలన్నారు. అవకాశాన్ని ఆయా గ్రామాల రైతులు వినియోగించుకోవాలని చెప్పారు.

96
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles