రైతుల సమస్యలు పరిష్కరించరా?

Wed,April 24, 2019 01:01 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : సమగ్ర భూసర్వేలో భాగంగా ఇప్పటి వరకు గ్రా మాల్లో కొంత మంది రైతులు వారికి పట్టాపాస్‌బుక్‌లు రాక, రైతుబంధుకు అర్హతలేక పోవడంతో ప్రతి ప్రజావాణిలో దరఖాస్తులు రైతులు ఇస్తూ తిరుగుతున్నారని పార్ట్-ఏ-బీ లో పెండింగ్‌లో ఉన్నవి పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇలాగే రెవెన్యూ సమస్యలు ఎన్నిరోజులు పెండింగ్‌లో ఉంచుతారని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తూ కలెక్టర్ వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాలోని గద్వాల, మల్దకల్ రెవెన్యూ అధికారులతో భూ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో కేవలం గద్వాల, మల్దకల్ మండలాల నుంచే అత్యధిక సంఖ్యలో భూ సమస్యలపై ప్రజావాణికి ఫిర్యాదులు వస్తున్నాయని దీనికి కారణం మీ నిర్లక్షమేనన్నారు. ఈ రెండు మండలాల్లో వీఆర్‌వోలను ఒక్కోరిని వారి గ్రామాల్లో ఇంకా డిజిటల్ సంతకం కానివి పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి ఆధార్ ఉండి ఇంకా పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచుకో వడానికి గల కారణాలు ఏమిటని వారిని ప్రశ్నించారు.

సరైన కారణాలు చూపకపోవడం, పెండింగ్‌లో ఉన్న వాటిపై వీఆర్వోలకు సరైన అవగాహన లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ముందుగా ఆధార్ ఉన్నవాటిని అన్నింటిని పరిష్కరించాలని ఒక వేళ పరిష్కరించలేనివి ఉంటే వాటన్నింటిని ఖాతాల వారిగా ఏ ఖాతా నెంబర్‌ను ఎందుకు పరి ష్కరించలేరో రాత పూర్వకంగా కారణాలు రాసి ఇవ్వాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వచ్చే వారం రోజుల్లో ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్లు ప్రతి రోజు ఉదయం గ్రామాల్లోని సమస్యలు ఉన్న భూముల్లో తిరగాలని వీఆర్వోలకు సరైన దిశానిర్ధేశం చేసి వారంలోపు పెండింగ్‌లో ఉన్న ఖాతాలు పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మ్యూటేషన్‌లు పెండింగ్‌లో ఉంచుకోవడానికి వీలు లేదన్నారు. మల్దకల్ మండలం తహసీల్దార్ బిజ్వారం, అమరవాయి, నేతోనిపల్లి, ఎల్కూర్, మల్లెందొడ్డి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే మండలం నుంచి రైతులు అత్యధికంగా ఫిర్యాదులు చేయడం ఏమిటని అలాంటప్పుడు వీఆర్వోలు ఉద్యోగంలో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. వచ్చేవారం జరిగే సమీక్షా సమావేశంలో ఖాతాల వారీగా సరైన ఖాతాలతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మల్దకల్ తహసీల్దార్ జ్యోతి, గద్వాల తహసీల్దార్ ఎన్.జ్యోతి ధరణి సూపర్‌వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles