పట్టాలకే రెక్కలొచ్చాయ్

Tue,April 23, 2019 12:41 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: సమగ్ర భూ సర్వేలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో దాదాపు 150 మంది రైతులు ఏడాదిగా ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా అధికారుల నుంచి ఛీదరింపులు ఎదుర్కొంటున్నారు జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని మద్దెలబండ రైతులు. ప్రభుత్వం భూ సర్వే చేస్తే తమకు హద్దులు ఏర్పడి కొత ్తపాసు పుస్తకాలు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన రైతులు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషపడ్డారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలుకే మోసం వస్తుందని రైతులు గ్రహించ లేదు. దీంతో ఆ రైతులకు పాత పాసు పుస్తకాల్లో వారసత్వంగా వచ్చిన భూమికి అన్ని ఆధారాలు ఉన్నా.. కొత్త పాసు పుస్తకాలు వచ్చేసరికి పాత పాసు పుస్తకాల్లో ఉన్న భూమికి కొత్త పాసు పుస్తకాల్లో అధికారులు నమోదు చేసిన భూములకు సెంటు, లేదా రెండు సెంట్లు తేడా ఉంటే రైతులు పట్టించుకునే వారు కాదేమో.. ఏకంగా గ్రామంలోని సుమారు 150మంది రైతులకు సంబంధించి ప్రతి రైతుకు రెండు నుంచి మూడెకరాలు తేడా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చేసిన తప్పును విచారించి సరిదిద్దాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులను ఏడాదిగా వేడుకుంటున్నా.. అధికారులు పట్టించుకోక పోవడంతో రైతులు ఏమి చేయాలో తోచడం లేదు. తమ సమస్య పరిష్కరించాలని వీఆర్వో, తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారుల చుట్ట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

రికార్డుల్లో సరిచేయాలని తిరుగుతున్నాం
సమగ్ర భూసర్వేలో తప్పులు దొర్లాయని గతంలో తమ పాసు పుస్తకాల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమి కొత్త పాసు పుస్తకాల్లో నమోదైందని విచారణ చేసి సరిదిద్దాలని మద్దెలబండకు చెందిన రైతులు సవారమ్మ, ఈరన్న, లింగన్న, జములమ్మ, సాయన్నతోపాటు సుమారు 150 మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని రైతులు వాపోయారు. అధికారులు తమ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల తాము తమ సమస్యను కలెక్టర్‌కు విన్నవించుకుందామని ప్రజావాణికి వచ్చినట్లు రైతులు తెలిపారు.

పట్టించుకోని రెవెన్యూ అధికారులు
భూ సమగ్ర సర్వే చేసే సమయంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి రికార్డుల్లో భూమి వివరాలు నమోదు చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో తమకు వచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో ఉన్న భూమి కంటే తక్కువగా ఉందని దీనికి కారణాలు చెప్పాలని రైతులు అధికారులను వేడుకున్న వారిలో చలనం రాలేదు. అధికారులు చేసిన పొరపాట్ల వల్ల గ్రామానికి చెందిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూములు సరిచేయాలని రెవెన్యూ అధికారులను వేడుకుంటే మీకు పనిపాట లేదా ఎప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతారు.. అందరివి అయినప్పుడు మీవీ అవుతాయి.. పనిలేక కార్యాలయం చుట్ట్టూ తిరుగుతున్నారని రైతులపైనే రెవెన్యూ అధికారులు ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles