అన్నదాతలు ఆందోళన చెందొద్దు

Tue,April 23, 2019 12:40 AM

- ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్
- డీఎస్‌వో చంద్రశేఖర్‌రెడ్డి
గద్వాల,నమస్తేతెలంగాణ: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతు లు ఆందోళన చెందవద్దని, ము ఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, పౌ రసరఫరాల శాఖ మంత్రి నిరం జన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతాం గంపై వర్షాల ప్రభావం పడకుం డా పౌరసరఫరాల శాఖ జిల్లాలో తగు చర్యలు చేపట్టామని రైతులు పండించిన పంట చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని డీఎస్‌వో చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు. జిల్లాలో మొత్తం 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిం దని ఇప్పటి వరకు జిల్లాలో రెండు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసి ధాన్యాన్ని ఎప్పటి కప్పుడు మిల్లులకు తరలి స్తున్నట్లు చెప్పారు. క్వింటాళ్లు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1770,సాధారణ రకానికి రూ.1750 మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గన్నీసంచులు, రైతులకు చెల్లించాల్సిన నిధులు అం దుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇ బ్బందులు, వారి సమస్యలు తెలియజేయడానికి కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ గది ఏర్పాటు చేశారని చెప్పారు. ఎవరైనా రైతులు ఫిర్యాదులు చేయాల నుకుంటే పౌరసరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00333,వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేస్తారని డీఎస్‌వో తెలిపారు. తేమ శాతం విషయంలో అధికారులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఒకే సారి పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుక రావద్దని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా దశల వారీగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మార్కెటింగ్‌శాఖతో సమన్వయం చేసుకుని అన్ని సమస్యలు అధిగమిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉం డేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్‌వో తెలిపారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles