పార్టీ ఉన్నతికి కృషి చేయాలి

Tue,April 23, 2019 12:40 AM

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలి
- ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- మల్లాపురం తండా సర్పంచ్‌తో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తల చేరిక

గద్వాల, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పటిష్టతకు పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తా కృషి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో కేటిదొడ్డి మండలం మల్లాపురం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శంకరమ్మతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తా పార్టీ అభివృద్ధి కోసం సైనికుడిలా పని చేయాలన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కోసం కృషి చేద్దామన్నారు. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే నియోజక వర్గంలో అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామో, త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపునకు అందరూ సహకరించాలన్నారు. గ్రామాల్లో అందరినీ కలుపుకొని కార్యకర్తలు ముందు కు సాగాలన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో శంకర్ నాయక్ ఉన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles