ప్రజల సంరక్షణ కోసమే కార్డన్ సెర్చ్

Tue,April 23, 2019 12:40 AM

- అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచండి
- కుటుంబీకుల సంరక్షణలోనే పిల్లలు ఈతకు వెళ్లాలి
- జిల్లా అదనపు ఎస్పీ కె.కృష్ణ
కేటీదొడ్డి : ప్రజల సంరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ కె.కృష్ణ సూచించారు. ధరూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి 7 గంటల వరకు జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్ ఆదేశాల మేరకు.. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరూర్ మండల కేంద్రంలోని ఎస్సీ, బిసీ కాలనీలలో మొత్తం 200 ఇళ్లను సోదా చేశారు. ఈ సోదాలలో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 51 బైకులను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ కె. కృష్ణ మాట్లాడుతూ రాబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రజలందరూ ప్రశాంత వాతవరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించు కోవాలని, ఎవ్వరూ గ్రామాలలో ప్రశాంత వాతావరణం చెడగొట్టరాదని, ఎవ్వరైనా గ్రూప్‌లుగా వర్గాలుగా ఏర్పాటు చేసి గోడవలు సృష్టించినైట్లెతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎండాకాలంలో సాదారణంగా ఇంటి తలుపులు తెరుచుకొని నిద్రిస్తారని, అలా కాకుండా ఇంటికి తాళలు వేసుకుని పడుకోవడం వలన దొంగతనాలను నివారించవచ్చని సూచించారు.

గ్రామాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి చిరునామాను, ఇతర వివరాలను దృవీకరించుకున్నాకే ఇంటిని అద్దెకు ఇవ్వాలని సూచించారు.
ఎండాకాలం కావడంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు కావడంతో పిల్లలు సొంత గ్రామాలకు వచ్చి సరదా కోసం బావులు, చెరువుల వెంట పోతుంటారన్నారు. అలా వెళ్లేటప్పుడు కుటుంబీకులు, పెద్దల వెంట మాత్రమే వెళ్లి తగు జాగ్రత్తలు పాటించి ఈత నేర్చుకోవాలని సూచించారు. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో గద్వాల సీఐ హనుమంతు, ధరూర్ ఎస్‌ఐ రాముడు, గట్టు ఎస్‌ఐ శ్రీనివాస్, కేటీదొడ్డి ఎస్‌ఐ బాలవెంకటరమణ, పోలీసులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles