పరిషత్ ఎన్నికలకు సర్వసిద్ధం

Tue,April 23, 2019 12:40 AM

- 262 ప్రదేశాల్లో 691 పోలింగ్ బూతులు
- ఓటు వేయనున్న 3,62,630 మంది ఓటర్లు
- జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు
- 8,70,000 బ్యాలెట్ పేపర్ల ముద్రణ
- విలేకరుల సమావేశంలో కలెక్టర్ శశాంక
- 2000 మందిని బైండోవర్ చేశాం
- ఎస్పీ లక్ష్మీనాయక్

జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను చేటపట్టామని కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల కోసం మొత్తం 262 ప్రదేశాల్లో 691 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశామని చెప్పారు. మూడు విడతల్లో నిర్వహి స్తున్న ఈ ఎన్నికల కోసం 2500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని చెప్పారు. జిల్లాలో డీపీవో, జేసీ, ఆర్‌డీవో స్థాయి అధికారులు అడిషనల్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారన్నారు. ఎంపీడీవో అధికారులు అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారని చెప్పారు. మొదటి విడతలో గద్వాల, గట్టు, ధరూర్, కేటీదొడ్డిలో 54 ఎంపీటీసి, 4 జెడ్పీటీసీ, రెండో విడతలో అయిజ, మల్దకల్, రాజోళి, వడ్డేపల్లిలో 47 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, మూడో విడతలో అలంపూర్, ఇటిక్యాల, మానపాడు, ఉండవెల్లిలో 40 ఎంపిటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. నామినేషన్లు పూర్తయిన తరువాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామన్నారు.

ఈ ఎన్నికల కోసం మొత్తం 1700 బ్యాలెట్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 8,70,000 బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసం ైఫ్లెయింగ్ స్కాడ్స్, అబ్జర్వర్లను పూర్తి స్థాయిలో నియమించామని చెప్పారు. నామినేషన్లు పూర్త యిన తరువాత పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమా వళి గురించి శిక్షణ అందిస్తామన్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 3,62,630 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రకటించారు. పోలింగ్ రోజు ఓటర్లందరూ పోలింగ్ స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డును కూడా వెంట తీసుకు వెళ్లాలని చెప్పారు. ఇక మార్చి 26 నుంచి ఏప్రిల్ 22 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ నూతనంగా ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు. మండల స్థాయిలో ఎంపీడీవో అధికారులు నూతన ఓటర్లకు ఓటు హక్కును కల్పిస్తారని చెప్పారు. ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతను ఏర్పాటు చేశా మన్నారు. మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నందున సిబ్బంది సరిపడినంతా ఉన్నారని చెప్పారు. గతంలో జరిగిన ఎమ్మెల్యే, పంచాయతీ, ఎంపీ ఎన్నికల్లో 1700 నుంచి 2000 మందిని బైండోవర్ చేశామని చెప్పారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles