మా భూములు సరిచేయండి

Mon,April 22, 2019 01:04 AM

-ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ పట్టా
-95ఎకరాలపై ఆధారపడిన 100కుటుంబాలు
-నేటికీ 21మందికి పట్టాలు
హన్వాడ : మా భూమిని సరిచేయండి సారూ.. ఈ భూమిపై 100మంది కుటుంబాలు ఆధారపడి జీవనం గడుపుతున్నాం.. ఒకరికి ఎక్కువ పట్టా.. మరొకరికి తక్కువ పట్టా ఉంది.. అందరికీ సమానంగా సరి చేయండి అంటూ నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన బాధితులు. గ్రామ సమీపంలోని 154, 154బై1, 154బై2 సర్వే నంబర్‌లో దాదాపుగా 95ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమిపై 100మంది కుటుంబాలు ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ఒకరికి ఎక్కువ పట్టా చేశారు.. మరొకరికి తక్కువ పట్టా చేయడంతో నిత్యం ఆ కుటుంబాలు గొడవలు పడుతున్నారు. అందుకు అందిరికీ సమానంగా భూమి పట్టా చేయాలని నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప.. భూమిని సరిచేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న వీఆర్‌ఓలు ఉన్న భూమి కంటే ఎక్కువగా పట్టా చేశారు. కానీ అక్కడ మాత్రం భూమి ఎక్కువగా లేకపోవడంతో ఉన్న భూమిని అందరికీ సమానంగా చేయాలని నిత్యం కార్యాలయం చుటూట తిరుగుతున్నారు. ఇప్పుటి వరకు 21మందికి మాత్రమే పట్టా చేసి పాసుపుస్తకాలు ఇచ్చారు. మిగతా వారికి సరి చేసి ఇవ్వాలని బాధితులు ఆరోపిస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటపెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని వాపోతున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles