పొలం తొలగిస్తామంటున్నారు!

Mon,April 22, 2019 01:03 AM

వంగూరు: మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన రైతు మేరెడ్డి శేఖర్‌రెడ్డి తండ్రి చిన్న రాంరెడ్డి పేరు మీద సర్వే నంబర్ 140,141,158తో పాటు పలు సర్వే నంబర్లలో 5-31 ఎకరాలు భూమి ఉంది. 2003లో 1-38 ఎకరాలు వేరే వ్యక్తికి విక్రయించారు. మిగిలిన పొలాన్ని 2013లో తన తండ్రి మరణానంతరం శేఖర్‌రెడ్డి తన పేరుపై భూప్రక్షాళన కార్యక్రమంలో విరాసత్ చేసుకోగా అధికారులు సర్వే నిర్వహించి 3-01 ఎకరాలకు ప్రొసిడింగ్ ఇచ్చారు. 140 సర్వే నంబర్‌లోని 0-15 గుంటలు పార్ట్-బీ లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారని రైతు పేర్కొన్నారు. మార్చి 27న కొత్త పాసు పుస్తకం వచ్చిందని తీసుకెళ్లమని సమాచారం ఇచ్చిన వీఆర్వో అందులోనుంచి 18 గుంటలను తొలగిస్తామని పేర్కొంటున్నట్లు రైతు వాపోయాడు. 2003లో తాము విక్రయించిన పొలాన్ని తొలగించిన అధికారులు, తీరా కొనుగోలు చేసిన రైతు ఆ సమయంలో అమలు చేసుకోలేదు. తీరా సదరు రైతు ఇప్పుడు తాము కొనుగోలు చేశామని పత్రాలతో అధికారులను ఆశ్రయించడంతో వారు ఇప్పుడు ఉన్న పొలాన్ని తొలగిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని రైతు శేఖర్‌రెడ్డి వాపోతున్నాడు. 5 ఎకరాల్లో 1-38 ఎకరాలు తొలగించిన అధికారులు ఇప్పుడు 3 ఎకరాలలో 18 గుంటల పొలం రికార్డుల నుంచి తీసేస్తామని పేర్కొంటున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles