గెలుపు గుర్రాలకే పట్టం

Mon,April 22, 2019 01:03 AM

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికలలో ఎమ్మెల్యేలు
-మండల స్థాయి కార్యకర్తలతో సమావేశాలు
-క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరణ
- 141 ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసీ సాధించడమే లక్ష్యం
- టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్న ఆశావహులు
జోగుళాంబ గద్వాల, నమస్తేతెలంగాణ ప్రతినిధి: పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉం డేవారెవరన్న అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. తమ గ్రామాల్లో, మండలంలో ఎంపీటీ సీ, జెడ్పీటీసీలు గెలిచేదేవరని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయం లో పరిషత్‌ఎన్నికల్లో పోటీ చేయాలని ఎదురు చూ స్తున్న అభ్యర్థులు తమకు టీఆర్‌ఎస్ పార్టీ తరుపున టికెట్టు వస్తుం దా? లే దాని ఉత్కంఠ వేచిచూస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహ న్ రెడ్డి, డాక్టర్. వీఎం అబ్రహం ప్రతి గ్రా మ కార్యకర్తలు, పెద్దలతో సమావేశాలు నిర్వహించి పరిషత్ అభ్యర్థులను ఎం చుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి నిబద్దతగా పనిచేస్తూ పార్టీ ప్రతి కార్యక్రమా న్ని తమ తమ గ్రామాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎంపికలు చేపడుతున్నారు. అయితే గ్రామీణస్థాయి కార్యకర్తలు పార్టీపై తమకున్న నిబద్దతను, వి శ్వాసాన్ని చాటుకుంటున్నారు. పార్టీ ఎవరిని ఎంపిక చేస్తే వారిని భారీ మె జార్టీతో గెలిపించుకుంటామని చాటిచెబుతున్నారు. ఏకతాటి పై కార్యకర్తలం తా కలిసి 141 ఎంపీటీసీ, 12 జెడ్పీటీ సీ స్థానాలను కైవసం చేసుకొ ని జెడ్పీచైర్మన్ పదవీని సొంతం చేసుకుంటామని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు..
గత ఎన్నికల్లో వెలువడిన ఫలితా మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ ముందు ఇతర పార్టీలన్ని చతికిల పడిపోవాల్సిందే. గడిచిన ఎన్నిక ల్లో ఊహించిన రీతిలో టీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయం మళ్లీ పునరావృ తం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని శక్తిగా అవతరిచిన టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో కూడా తన సత్తా ను చాటనుంది. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉం డటంతో స్థానికసంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సునాయాసంగా గెలువనున్నారు. టీఆర్‌ఎస్‌లో గెలుపు వాతావరణం పక్కగా కనిపిస్తుండటంతో పోటీచేసే ప్రతి ఒక్క అభ్యర్థి టీ ఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేయాలని ఉవ్విల్లూరుతున్నారు. ప్రతి పక్షపార్టీలో ద శాబ్దాల కాలంగా కరడుకట్టిన కార్యకర్తలు గా ము ద్రవేసుకున్న నాయకులు సైతం గులాబీ కండువా కప్పుకొని టీఆర్‌ఎస్ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎమ్మెల్యేల చు ట్టూ తిరుగుతున్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ నిబద్దులకే పరిషత్ టికెట్టు..
గతవారం రోజులుగా పరిషత్ అభ్యర్థులను ఎంచుకునేందుకు గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూ ర్ ఎమ్మెల్యే డాక్టర్.వీఎం అబ్రహం త లమునకలయ్యారు. అభ్యర్థులను ఎం పిక చేసే విషయంలో సమిష్టి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఆయా గ్రా మా ల్లో టీఆర్‌ఎస్ తరుపున ఎంత మంది పోటీ పడుతున్నాకాని కార్యకర్తలందరి, గ్రామపెద్దల నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని ఎంపికలు చేస్తున్నారు. గ్రామసమస్యలు పూర్తి తెలిసి ఉండి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, టీ ఆర్‌ఎస్ పార్టీ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక సైనికుళ్లా పనిచేసే వారికి మాత్రమే పోటీకి ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి మం డలంలో సమావేశాలు నిర్వహించి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో, గ్రామ పెద్దలతో విస్తృతం గా చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరి మన్ననలు పొందిన వారికే అవకాశం కల్పిస్తున్నారు. సమిష్టి నిర్ణయాలను ఎమ్మెల్యేలు ప్రకటించనున్నారు.

పార్టీ ఎంపికచేసిన అభ్యర్థుల విజయానికై కృషి..
టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు పార్టీపై తమకున్న నిబద్దతను చాటుకుంటున్నారు. తమ తమ గ్రామాల్లో పార్టీ ఎవరిని పరిషత్ అభ్యర్థులుగా నిర్ణయించినా కాని వారి గెలుపుకోసం విశేషకృషి చేస్తామని చాటిచెబుతున్నారు. పార్టీలో కా ర్యకర్తలుగా ఉన్నందుకు టీఆర్‌ఎస్ నిర్ణయమే శిరోదార్యమంటున్నారు. సుదీర్ఘచర్చల అనంత రం పార్టీ పెద్దలు తీసుకున న్న నిర్ణయా న్ని తామంతా గౌరవిస్తూ తూ చాతప్పకుండాపాటిస్తామంటున్నారు. ఎక్కడా తారతమ్యాలు లేకుండా కుటుంబ స భ్యుల్లా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చే సుకునేందుకు కార్యచరణ చేపడుతామంటున్నారు. కొన్నిగ్రామాల్లో అంద రూ సహకరిస్తే ఏకగ్రీవం చేసుకునేందు కుప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గు లాబీ జెండా ఎగరవేసేందుకు సమిష్ఠి కృషిచేస్తామని వెల్లడిస్తున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles