స్థానిక ఎన్నికలు సజావుగా.. నిర్వహించాలి

Mon,April 22, 2019 01:03 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలోని 12 మండలాల ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాలో 141 ఎంపీటీసీ,12 జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించే ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మొదటి విడత నామినేషన్లు అధికారులు స్వీకరిస్తారన్నారు. మొదటి విడతలో గద్వాల, ధరూర్, గట్టు, కేటిదొడ్డి మండలాలకు, రెండో విడతలో మల్దకల్, అయిజ, రాజోళి, వడ్డెపల్లి మండలాలకు, మూడో విడతలో మానవపాడు, అలంపూర్, ఉండవెళ్లి, ఇటిక్యాల మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచామన్నారు. మొదటి విడత మండలాల్లో పోటీచేసే అభ్యర్థులకు ఈనెల 22నుంచి 24వరకు నామినేషన్లు స్వీకరించి 25న పరిశీలన, 28న ఉపసంహారణ, మే 6న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండో విడతలో 26నుంచి 28వరకు నామినేషన్లు స్వీరకరణ, 29న పరిశీలన అనంతరం మే 2న ఉపసంహారణ అనంతరం మే 10న పోలింగ్ ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికలకు ఈనెల 30నుంచి మే 2న వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 6లోపల ఉపసంహారణ అనంతరం 14వ తేదీ పోలింగ్ ఉంటుందన్నారు. నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నందువల్ల ఎన్నికలకు సంబంధించి అన్ని నియమాలు అధికారులతో పాటు రాజకీయ నాయకులు పాటించాలన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు అన్ని రకాల శిక్షణ ఇచ్చామని, ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ విధానంలో ఉంటాయన్నారు. సమావేశంలో అన్ని మండలాల ఎంపీడీవోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles