ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

Mon,April 22, 2019 01:02 AM

-గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి
-7 జెడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలు కైవసం చేసుకుందాం
-ఎమ్మెల్యే డాక్టర్ వీఎం.అబ్రహం
-పట్టణంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం
అయిజ : ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలుచుకు ని టీఆర్‌ఎస్ సత్తా చాటుదామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం. అబ్రహం అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఆదివారం అయిజ పట్టణంలో ని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ విజయమే అంతిమ లక్ష్యంగా కృషి చేద్దామన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ముఖ్య నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగినట్లయితే అలంపూర్ నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలను కైవసం చేసుకుంటామన్నారు. 7 మండలాల్లో టీఆర్‌ఎస్ ఎంపీపీలే పీఠం ఎక్కుతారన్నారు. సీ ఎం కేసీఆర్ ప్రవేశపెడుతోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండాను రెపరెపలాడే విధంగా ప్రతి ఒక్కరూ కృ షి చేయాలన్నారు.

రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి విడుదల చేయనన్నీ నిధు లు అలంపూర్‌కు విడుదల చేయడంతోపాటు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకంను చేపట్టామన్నారు. రూ.783 కోట్లతో అనతికాలం లో ప్రాజెక్టును పూర్తి చేసి గత వానాకాలంలోనే నీరు పారించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆర్డీఎస్ ఆ యకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు నెట్టెంపాడ్ ప్రాజెక్టు నుంచి అందించేందుకు చర్యలు తీసు కుంటున్నామని, నెట్టెంపాడ్ కాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తే ప్ర తి సెంటుభూమికి నీరు అందుతుందన్నారు. నియోజకవర్గాన్ని విద్య, వైద్య పరంగా అభివృద్ధి చేస్తానని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఎజెండాగా గడప గడప కూ తిరిగి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అ ధ్యక్షుడు రాముడు, ఎంపీటీసీ రఘునాథరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎలియాజర్, వెంకటేశ్, ఈశ్వ ర్, మహబూబ్‌భాష పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles