అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలవాలి

Sun,April 21, 2019 12:51 AM

- అసంతృప్తులకు తావు ఇవ్వవద్దు
- గ్రామాల అభివృద్ధే అజెండా..
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- గులాబీ జెండా మళ్లీ ఎగుర వేయాలి
- జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్
- ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
- టీఆర్‌ఎస్ క్యాకర్తలతో సమావేశం

మల్దకల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వేద పాఠశాలలో శనివారం టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు అధ్యక్షతన మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో వారు మాట్లాడుతూ మండలంలో 15 ఎంపీటీసీ స్థా నాలు గెలుచుకొని గులాబీ జెండాను ఎగుర వేయా లన్నారు. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటే గ్రామాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కావున గ్రామాల్లో మంచి వ్యక్తిని అభివృద్ధి పరిచే వారిని ఎంపిక చేసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యావంతులు ఉంటే చాలా మంచిగా ఉంటుందన్నారు. మండలంలో టీఆర్ ఎస్ పార్టీ జెండాను ఎగుర వేయాలన్నారు. దీనికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు.

అసంతృప్తులకు తావు ఇవ్వవద్దు..
ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థుల విషయాలల్లో గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా పోటీల్లో నలుగురు, ఐదు మంది ఉన్నారన్నారు. అయితే ప్రతి ఒక్కరూ పార్టీకి పని చేసిన వారన్నారు. కావున అభ్యర్థుల ఎంపిక విషయంలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ఎన్నుకున్న వారికి పార్టీలోని కార్యకర్తలు వెన్నుపోటు పోడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. అంతే కానీ తమకు పార్టీ అభ్యర్థిగా అవకాశం రాలేదని అసంతృప్తికి లోనుకావద్దన్నారు. పార్టీలో మళ్లీ ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు. అప్పుడు వారికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ రాజారెడ్డి, ఎంపీటీసీ వెంకటన్న, నాయకులు, సత్యారెడ్డి, మధుసూదన్‌రెడ్డి సీతారామిరెడ్డి, మేకల సోంపల్లి, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తూం కృష్ణారెడ్డి, విక్రంసింహారెడ్డి, నరెందర్, బాబురావు, నర్సిం హారెడ్డి, అజయ్, ఆంజనేయులు, తి మ్మారెడ్డి, మీసాల రాజారెడ్డి, ఆహ్మద్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles