మోగిన ప్రాదేశిక ఎన్నికల నగారా ..

Sun,April 21, 2019 12:49 AM

- పల్లెల్లో వేడెక్కిన రాజకీయం
- ఎక్కడ చూసినా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైనే చర్చ
- టికెట్ల కోసం ఆశావాహుల ప్రయత్నాలు

అయిజ: ప్రాదేశిక ఎన్నికలకు న గారా మోగింది. రాష్ట్రంలోని 32 జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలను మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం రాష్ట్ర ఎన్నికల సం ఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు విడుతల్లో ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చ ర్యలు తీసుకుంటోంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, మే 6న ఎన్నిక లు నిర్వహించనున్నారు. రెండో విడు త ఎన్నికలకు ఈ నెల 26న నోటిఫికేషన్ రానుండగా, మే 10న ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించనుండగా, మూ డో విడుత నోటిఫికేషన్‌ను ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేయను ండగా, మే 6,10,14 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది. గ ద్వాల నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొదటి విడుత, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్‌తోపాటు అలంపూ ర్ నియోజకవర్గంలోని అయిజ, రా జోళి, వడ్డెపల్లి మండలాల్లో రెండో వి డుత, అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెళ్లి మండలాల్లో మూ డో విడుత ఎన్నికలు జరురుగనున్నా యి.

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో అలంపూ ర్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. ఎక్క డ చూసినా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎ న్నికలపైనే చర్చ జరుగుతోంది. ని యోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల్లో స్వీప్ చేయడానికి టీఆర్‌ఎస్ నాయకులు వ్యూహం రచిస్తున్నా రు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టడానికి సిద్ధంగా కనిపిస్తున్నప్పటికీ అభ్యర్థులు ఎవరనేది ఆసక్తి నెలకొంది. జడ్పీటీసీలుగా ఎవరెవరు పోటీ చేయబోతున్నారు.. ఎంపీపీ పదవిని ఎవరు కైవసం చేసుకుంటారు.. వైస్ ఎంపీపీ రేసులో ఎవరుంటారు .. లోకల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది .. వార్ వన్‌సైడేనా అనే ప్రశ్నలు రచ్చబండ చర్చల్లో వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయమై రాజకీయ పార్టీలు మండల స్థాయి సమావేశాలు ఏర్పా టు చేసి క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పోటీ చేయబోయే అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటూనే టికె ట్ల కోసం నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలంపూర్ నియోజకవర్గంలో 7 జడ్పీటీసీలు, 72 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో టీఆర్‌ఎస్ పాగా వేయాలని టీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం తో పార్టీలు అభ్యర్థులను బరిలో దిం పేందుకు కసరత్తు చేస్తున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles