రెండేళ్లు నుంచి తిరుగుతున్నా..

Sun,April 21, 2019 12:49 AM

- 2.20 కుంటల భూమికి 25 కుంటలు మాత్రమే పట్టా..
- మరో సర్వే నెంబర్‌లోని 39 కుంటల భూమి పట్టా కాలేదు..
- రైతు గంట వెంకటయ్య ఆవేదన
హన్వాడ : హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామానికి చెందిన గంట వెంకటయ్య సొంత భూమి హన్వాడ శివారుల్లోని 613, 612, 605 సర్వే నెంబర్‌లో మొత్తం రెండు ఎకరాల 20కుంటల భూమి ఉండాగా 25కుంటల భూమి మాత్రమే తమకు పట్టా చేశారన్నారు. మిగతా భూమిని తమకు పట్టా చేయాలని రెండు సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. సంబంధిత వీఆర్‌వో మాత్రం రేపు మాపు అని కాలం వెల్లబుచ్చుతున్నాడు. అలాగే 624సర్వే నెంబర్‌లో ఎంత భూమి ఉందని సర్వే చేయించాగా వాటిలో 39కుంటల భూమి ఉంది. అట్టి భూమిని కూడా నాకు పట్టా చేయాలని వీఆర్‌వోను అడిగితే నేటి వరకు తమకు పట్టా చేయడం లేదన్నా రు. పట్టా చేయాలని ఆయనకు డబ్బులు కూడా ఇచ్చినట్లు వెంకటయ్య ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వం నుంచి 25 కుంటల భూమికి మాత్రం పంటపెట్టుబడి డబ్బులు వచ్చాయి. మిగత భూమి పట్టాలేకపోవడంతో తాము నష్టపోతున్నాం. పలుమార్లు గతంలో ఉన్న తహసీల్దార్‌కు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులో తమకు పట్టా చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాన్నారు. దీనిపై వీఆర్‌వోను వివరణ అడుగంగా ఆర్‌వోఆర్‌లో ఎంత ఉందో అంతే భూమి ఎక్కిస్తా.. పాసుపుస్తకాలో ఎక్కువగా ఉంటే తమ కు తెలియదు. 624 సర్వేలో ఎంత భూమి ఉందో ఆర్‌ఐ రిపోర్టు ఇచ్చిన వెంటనే పట్టా చేస్తాం, నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు.

కాలు మొక్కినా కనికరించడం లేదు : ఉంద్యాల శివన్నగౌడ్
చిన్నచింతకుంట : చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన శివన్నగౌడ్ హరిజన్ పెద్ద హన్మంతు, చిన్న హన్మంతు (దానియేలు)ల దగ్గర 314 సర్వే నెంబర్‌లో 3.03గుంటల భూమిని ఉంద్యాల గ్రామశివారులో 35 ఏళ్ల కిందట కొన్నారు. ఆ భూమిలో బోరు వేసి పంటలు పండించుకుంటున్నారు. నా పరిస్థితి బాగులేక ఆత్మకూర్ రిజిస్టర్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్లు తీసుకురాగా గతంలో ఉన్న ఆత్మకూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టదారు పాసుపుస్తకలు ఇచ్చారు. అట్టి పాసుపుస్తకాలను ఉంద్యాల సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పెట్టి లోను తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల క్రిందట అప్పు కట్టియున్నాను. బ్యాంకు మేనేజర్ పాసుపుస్తకాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఈ విషయంను చిన్నచింతకుంట తహసీల్దార్‌కు దృష్టికి తీసుకువెళ్లగా పాత పాసుపుస్తకం ఇస్తేనే కొత్త పుస్తకం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌నుగా సంప్రదించిగా బ్యాంకులో తెలుసుకుని సరిగా ఉంటే నూతన పాసు పుస్తకం ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తహసీల్దార్ ఇవ్వగా ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. ఉంద్యాల సెంట్రల్ బ్యాంకు ద్వారా నాకు పాసుపుస్తకం ఇప్పించాలన్నారు. పట్టదారు పాసుపుస్తకం లేకపొవడంతో నేను రెండుసార్లు దాదాపు రూ.32వేల వరకు ప్రభుత్వం అందించే రైతుబంధు పెట్టుబడి సహాయం కొల్పోయనన్నారు. బ్యాంకు మేనేజర్ల కాలు మొక్కినా కనికరించడం లేదు. అధికారులు స్పందించి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి నన్ను ఆదుకోవాలి.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles