జెడ్పీ చైర్మన్ పదవిని.. కైవసం చేసుకుందాం

Sat,April 20, 2019 12:44 AM

- పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి
- ఎమ్మెల్యే వీఎం అబ్రహం
- వడ్డెపల్లి, రాజోళి కార్యకర్తలతో సమావేశం

ఉండవెల్లి : పార్టీ నిర్ణయానికి కట్టు బడి పనిచేసి గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం పార్టీ ముఖ్యకార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని పార్టీ కార్యాయలంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై వడ్డెపల్లి, రాజోలి మండలాల టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివిధ గ్రామాల, మండలాల నాయకు ల అభిఫ్రాయాలను సేకరించారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ని యోజకవర్గంలో 7 జెడ్పీటీసీ స్థానాలు, 72 ఎంపీటీసీ స్థానాల్లో పూర్తిస్థాయి మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలన్నారు. పార్టీ అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా.. అభ్యర్థుల గెలు పు కోసం పని చేయాలన్నారు. గ్రామాల్లోని నాయకులే ఏ అభ్యర్థికి టికెట్ ఇ వ్వాలో నిర్ణయిస్తే.. వారి పేర్లనే అదిష్టా నం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీకో సం పనిచేసిన వారిని గుర్తించి సముచిత న్యాయం చేస్తామన్నారు. అలంపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదు కనుకనే సీఎం కేసీఆర్ అలంపూర్ అభివృద్ధి చేయడంలో భాగంగానే జెడ్పీ చైర్మన్ పదవిని అలంపూర్‌కే కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంతో తు మ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయని కోడ్ ముగిసిన వెంటనే తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్‌కు మూడు రిజర్వాయర్లు తీసుకొచ్చి అలంపూర్‌ను కోనసీమగా మారుస్తానన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శీను, తనగాల సీతారామిరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, గంగిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles