చిన్నారులపై సెల్ ప్రభావం..

Sat,April 20, 2019 12:43 AM

- ఆరుబయటి ఆటల కంటే సెల్ ఆటలకు ప్రాముఖ్యం
- పిల్లలపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
- పిల్లలకు సెల్ రేడియేషన్‌తో ముప్పు అంటున్న వైద్య నిపుణులు

వనపర్తి వైద్యం : పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం చిన్నారులపై ఎంతో ప్రబావం చూపుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ వాడటం నిత్యకృత్యం అయింది. ఇందులో భాగంగా చిన్నారులు సెల్‌ఫోన్ లేకపోతే తమ కార్య కలాపాలను చేపట్టలేని దుస్థితి నెలకొంది. సెల్‌పోన్ వాడకంలో పెద్దవారితో పాటు చిన్నపిల్లలపై పెను ప్రభావితం చూపుతుందని నిఫుణులు పేర్కరోంటున్నారు. సెల్‌ఫోన్ వాడకాన్ని ఎంతతగ్గిస్తే ఆరోగ్యానికి అంతమంచిదని చెబుతు న్నారు. చిన్నారులకు చూపే సెల్ ప్రభావం అనే అంశంపై నమస్తే తెలంగాణ విశ్లేష్ణాత్మక కథనం ఇది.

చిన్నారులలో పెను ప్రభావం..
చిన్నారులు సెల్‌ఫోన్ అమితంగా ఆకర్షిస్తున్నాయి. సెల్‌ఫోన్లో ఉండే యూట్యూబ్, ఇంటర్నేట్ వాటితో ప్రపంచమే తమ గుప్పెట్లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఎంతో సమాచార సేకరణ కూడా ఇందులో లభ్యమవుతుంది. చిన్నారులను కథలు, పాటలు, నృత్యాలు తదితర వంటివి ఉండటంతో వాటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మూడేళ్లు పైబడిన పిల్లలపై సెల్ ప్రభావం ఎంతగానో ఉంటుంది. సెల్‌ఫోన్ వాడకం వల్ల చిన్నారులలో మందబుద్ధి ఏర్పడంతో పాటు మేథా సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రధానంగా కంటిచూపుపై సెల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెల్‌ఫోన్ రేడిషన్ వల్ల మూడు సంవత్సరాల వయస్సు కన్న తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి సెల్‌ఫోన్స్‌ను దూరంగా ఉంచడం చాలా మంచిదని నిఫుణులు అంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోషపడాలో, దాని వల్ల సంభవిస్తున్న దష్ఫాలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులది. చిన్న పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ప్రస్తుతం సెల్‌ఫోన్ తప్పనిసరి. మరి లేదంటే పూటగడువని పరిస్థితి. గంటల తరబడి మాట్లాడే యువతి, యువకులు సెల్ వలయంలో చిక్కుకుంటున్నారు. అతిగా సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడకు చాలా ప్రమాదమని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. సెల్‌లో మితిమిరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఈ రేడియేషన్ దెబ్బతిస్తుందని నిఫుణులు చెబుతున్నారు. అప్పటికి సెల్‌తో వస్తున్న ప్రభావం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుత రోజుల్లో పక్కలో పెళ్లాం, పిల్లల కంటే సెల్‌ఫోన్స్‌తో ఎక్కువగా నిద్రపోతున్నారు. నిద్రలేవగానే సెల్‌లో వచ్చే మేసెజ్‌లను చూడటమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఎంతో మంది వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంది.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles