పాస్‌బుక్కులు అందక పరేషాన్

Sat,April 20, 2019 12:42 AM

- నిడుగుర్తిలో 72 ఎకరాలను నేటికీ లెక్క తేల్చని అధికారులు
- ఇబ్బందులు పడుతున్న రైతులు

ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తికి చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన కొత్త పట్టా పాసు బుక్కులు అందక ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన 20మందికి పైగా రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములకు కొత్త పటా ్టపాసు బుక్‌లను అందించాలని నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేసినా తమ మొరను ఆలకించే వారు లేరని వాపోతున్నారు. గ్రామానికి చెందిన మల్‌రెడ్డి, గాండ్ల వినోద్, ఖాదర్‌ఖాన్, జుబేదాబేగం, అమీర్‌ఖాన్, చాంద్‌పాషా, మహబూబ్‌పాషా, అహ్మద్ ఆరిఫ్, అమీనాబీ, ఎండీ ఖాజామైద్దీన్, ఎండీ కుత్బుద్దీన్, బాపురం గ్రామానికి చెందిన పిల్లికండ్ల శివప్పలతో పాటు మరి కొంత మంది రైతులకు నిడుగుర్తి గ్రామ శివారులో నంబర్ 486, 611, 609, 612, 613, 614, 633, 634, 655 సర్వే నంబర్లలో వ్యవసాయ భూములు ఉన్నాయి. పట్టా భూములను కొందరు రైతులు యాభై ఏళ్లకు పైగా వారసత్వంగా పట్టాదారు పేరు మార్పిడి చేసుకున్నారు. మరి కొందరు స్థానిక రైతుల వద్ద కొనుగోలు చేసి పట్టా సర్టిఫికెట్లు పొంది అనుభవిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తర్వాత అధికారులు తమకు కొత్త పట్టాదారు పుస్తకాలు అందించలేదని.. దీంతో తాము ప్రభుత్వం అందిస్తోన్న రైతు బంధు పంట పెట్టుబడి సహాయం నిదులు అందుకోలేక పోయా మని, రైతు బీమా వర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు పట్టా బుక్కులు అందజేయాలని ఏడాది కాలంగా తహసీల్దార్, వీఆర్‌వోల చుట్టూ తిరుగుతున్నామని.. రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్ భూమిగా నమోదైంది.. అందుకు తామేమి చేయలేమని, మీకోసం మా ఉద్యోగాలు పోగొట్టుకోవాలా అని అధికారులు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయమే జీవనాధారమైన తమకు పట్టా బుక్కులు అందక పోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు చెబుతున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles