ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు

Sat,April 20, 2019 12:42 AM

గద్వాల రూరల్ : మండల పరిధిలోని మెల్లచెరువు, జమ్మిచేడు, పూడూరు, కాకులారం, అనంతపురం, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల చర్చిలలో శుక్రవారం గుడ్ ప్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలను ప్రత్యేకంగా బోధించారు. ఉపవాస దీక్షలో ఉండి ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఉపవాసం ఉన్నవారికి నిమ్మరస పానీయాలు చర్చి కమిటీ సభ్యులు అందించారు. జమ్మిచేడు గ్రామ ంలో ఎంబీ ఓలీవ చర్చి ఆధ్వర్యంలో రెవ. అమ్రోజ్ పాస్టర్ ఆధ్వర్యంలో శుభ శుక్రవారము (గుడ్‌ఫ్రైడే) సందర్భంగా సంఘం సభ్యులచే సిలువలో పలికిన ఏడు మాటలను ఏడుగురు చేత సందేశాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంబీ ఓలీ వ చర్చి చైర్మన్ దేవరాజు, యేసు, నర్సింహులు, సంటెన్న, దావీదు, జయ న్న, వందనం, ఏసేపు, యోహన్, అబ్షలేం, యువరాజు, శేషన్న, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

గద్వాల పట్టణంలో..
గద్వాలటౌన్ : గుడ్‌ప్రైడే వేడుకలను శుక్రవారం జిల్లాలోని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం గద్వాలలోని యంబీ మిస్పా చర్చి, గంజిపేటలోని హోసన్నా మందిరం, రెండవ రైల్వే గేట్‌లోని చర్చిలలో ఆయా సంఘం పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యంబీ మిస్పా చర్చి ఆవరణలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు వాఖ్యాలను పాస్టర్ బెనహర్‌రాస్ ప్రవచించారు. యేసుక్రీస్తు మన పాపములు తొలగుట కొరకై శిలువపై మరణించాడని, కావున అందరు గుడ్‌ఫ్రైడే రోజున ఉపవాస ప్రార్థనతో ఆయనను ధ్యానించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్లు, సంఘం సభ్యులు, యవ్వనస్తులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles