జైభజరంగ్ బలి

Sat,April 20, 2019 12:42 AM

గద్వాల టౌన్ : రామలక్ష్మణ జానకీ... జైబోలో హనుమాన్‌కీ... జైశ్రీరాం... జైజైరాం... జైశ్రీరామధూతకీ...జై అంజనీపుత్రం.. జై హనుమా...జై జై హను మా నామస్మరణంతో జిల్లా మారుమోగింది. శ్రీఆంజనేయ స్వామి ఆలయాలన్ని శ్రీరామ నామ జపంతో పులకించాయి. శుక్రవారం స్వామి జన్మదినోత్సవం, ఇదే రోజు లంకలో సీతమ్మను హనుమంతుడు కనుగొన్న రోజు కావడంతో భక్తులు విజయోత్సవ, జన్మదినోత్సవ వేడుకులను జిల్లా వ్యాప్తంగా ఘ నం గా జరుపుకున్నారు. ఉదయం నుం చే ఆయా ఆలయాల్లో భక్తులు స్వామి వారిని దర్శించు కునేందుకు పోటెత్తారు. అలాగే పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం గద్వాలలో స్వామి వారి శోభాయాత్రను నిర్వహించారు. యాత్రను మాజీ మంత్రి, పాలమూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రారంభించారు. యాత్ర లో పెద్ద ఎత్తున్న యువత పాల్గొంది. యాత్రలో ఎలాంటి సంఘనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమినాడు శ్రీ ఆంజనేయస్వామి పుట్టిన రోజుగా, ఆంజనేయుడు సీతమ్మను లంకలో కనుగొన్న రోజుగా భావిస్తూ విజ యోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ, హనుమ భక్తులు.. జన్మదినోత్సవ, విజయోత్సవ వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలో గద్వాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన రహదారుల గుండా స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఊరేగిస్తూ శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో అడగుడుగున స్వామివారికి భక్తులు నీరాజనాలు పలికి.. భక్తితో కొలిచారు.

వివిధ ఆలయాల్లో..
జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా జిల్లా కేం ద్రం గద్వాల కోటలో, ఉత్తరాధి మఠం లో, నదీ అగ్రహారం వెళ్లే మార్గంలో ఉ న్న ఆలయంలో, దౌదరపల్లి శివారులోని ఆంజనేయస్వామి ఆలయంలో, అలాగే రాతిబుర్జు, బుర్దపేట, గంజిపేట, హౌ సింగ్‌బోర్డు, భీంనగర్, వాటర్‌ట్యాంకు లో గల హనుమ ఆలయాల్లో ఉత్సవాల ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ని ర్వహించారు. అలాగే స్వామి వారికి సిం ధూరాభిషేకం, తమలపాకుల పూజ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆయా ఆలయాల్లో అన్నదాన కా ర్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా విజయోత్సవ యాత్ర..
హనుమ జన్మదినోత్సవం, విజయోత్సవాన్ని పురస్కరించుకుని భజరంగ్ దళ్, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్ంయలో నిర్వహించిన విజయోత్సవ యాత్ర అత్యంత వైభవంగా సాగింది. కోటలోని ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగింది. దీంతో పట్టణం కాషాయమయంగా మారింది. శోభాయాత్రలో హ నుమ, జై శ్రీరాం నామస్మరణ మిన్నంటింది. శోభయాత్రలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ, ఎస్‌ఐలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు.

పాల్గొన్న నాయకులు..
హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్రలో మాజీ మంత్రి, పాలమూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొని స్వా మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. బీజేపీ నాయకులు వెంకటాద్రిరెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాము లు, రా మాంజనేయులు, బీ జేపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రవిఎక్బోటే, జనార్ధన్, వీహెచ్ పీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌ధల్ నాయకులు, ఏబీవీపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles