నల్లమలలో భారీ వర్షం

Sat,April 20, 2019 12:41 AM

- అమ్రాబాద్ మండలంలో వడగళ్ల వర్షం
- అకాల వర్షంతో 4 ఎకరాల్లో వరి పంట నష్టం
- ఏడేళ్లకు నిండిన లోకేశ్వరం చెరువు
- వర్షం రాకతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

అమ్రాబాద్ : అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం అకాల వర్షం భారీగా కురిసింది. రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వడగళ్లతో కురిసిన ఈ అకాల వర్షానికి మండలంలోని మొల్కమామిడి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌నెడ్డి, చంద్రయ్యలకు చెందిన రెండేసి ఎకరాల వరి పంట నేల రాలింది. భారీగా కురిసిన వర్షానికి కుంటలు, వాగులు పొంగిపొర్లాయి. మండల శివారులోని లోకేశ్వరం చెరు వు ఏడేళ్ల తరువాత నిండటంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు తాళ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చిం దని, పశువులకు పచ్చని గడ్డి దొరుకుతుందని రైతులు అంటున్నారు.

మండల పరిధిలో...
అమ్రాబాద్ రూరల్ : నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం పలు గ్రామాల్లో శుక్రవారం అతిభారీ వర్షం మధ్యాహ్నం 1:20 నిముషాలకు ప్రారంభమై దాదాపు 40 నిమిషాల పాటు ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన కురింది. వేసవి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఏనాడూ వర్షం కురువ లేదని, వర్షకాంలో కురిసిన మాదిరిగా గాలి, వాన భీభత్సం సృష్టించిందని స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంతో పాటు మాచారం, వెంకటేశ్వర్లబావి, తుర్కపల్లి తదితర గ్రామాల్లో కాలువలు పొంగిపొర్లాయి. రెవెన్యూ అధికారులు మండంలో 11 సెంటి మీటర్ల వాన కురిసిందని తెలిపారు. మెల్కమామిడి గ్రామం దాటిన తరువాత అమ్రాబాద్‌తో పాటు దాని చుట్టపక్కల కురిసిన వర్షం కారణంగా గుంతలు, కాలువలు నిండి రోడ్డుమీద నుంచి నీరు పారింది. గాలివానకు కొందరి ఇంటి రెకులు గాలికి ఎగిరిపోయినట్లు తెలిసింది.

67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles