మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Sat,April 20, 2019 12:41 AM

పెద్దమందడి : మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన లక్ష్మీ(29) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై విజయబాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. మోజర్ల గ్రామానికి చెందిన మనెమ్మ, బాలయ్యల కుమార్తె లక్ష్మీని కానాయపల్లి గ్రామానికి చెందిన సాయిరాంకు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మోజర్ల గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త సాయిరాం అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోయేవాడని, ఈ మధ్య భర్త తనను పట్టించుకోకపోగా ఇంటికి సరిగా రావడం లేదని భర్తతో గురువారం రాత్రి గొడవపడింది. క్షణికావేశంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అది గమనించిన సోదరులు నరేశ్, రమేశ్‌లు వనపర్తి జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. మృతురాలి తల్లి మనె మ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles