హంతకుల కోసం గాలింపు

Sat,April 20, 2019 12:41 AM

- మలక్‌పేట యశోద దవాఖానలో ప్రాణాలతో పోరాడుతున్న సత్యమ్మ
మూసాపేట : వేముల గ్రామానికి చెందని మధుసూదన్ రెడ్డి అతని భార్య సత్యమ్మలను సొంత అన్న కృష్ణారెడ్డి అతని భార్య సత్యమ్మ కలిసి వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన సంఘటన పాఠకులకు విధితమే. అంతకుల ఆనవాళ్ల కోసం శుక్రవారం భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి, స్థానిక ఎస్సై మధుసూదన్‌గౌడ్‌తో పాటు కలిసి సంఘటనా స్థలానికి మరో మారు పరిశీలించారు. హంతకుల ఆనవాళ్ల కోసం అన్వేషిం చారు. నిందితులు కృష్ణారెడ్డి, అతని భార్య సతమ్మ కోసం భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డితో పాటు ఆయన పర్యవేక్షణలో నలుగురు ఎస్సైలతో నాలుగు బృంధాలుగా విడిపోయి గాలింపు చేపట్టినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృంధాలతో నింధితులకు సంబంధించిన వారితో పాటు, బంధువులు, సన్నిహితలతో కలిసి అతని కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై సీఐ పాండురంగారెడ్డి మాట్లాడుతూ వీలైనంత త్వరలోనే హంతకులను పట్టుకుంటామని చెప్పారు. హత్యకు పాల్పడిన కృష్ణారెడ్డి గతంలో ఆర్మీలో పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అతను ప్రస్తుతం ఎస్‌టీఎప్ సెక్యూరిటీ సంస్థలో సెక్రటేరియట్‌లో పని చేస్తున్నట్లు తెలిసిందని తెలిపారు.

యశోద ఆసుపత్రికి సత్యమ్మ తరలింపు
సొంత అన్న కృష్ణారెడ్డిని వేడుకున్నా వదలకుండా అతి కిరాతకంగా కత్తితో నరకడంతో చెల్లెలు సత్యమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొంతున్న విషయం విధితమే. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మధ్యరాత్రి ఎస్‌వీఎస్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె చెయ్యి రెండుగా చీలిపోయి, చేతి వెళ్లు మొత్తం తెగిపోయాయన్నారు. అందుకను ఆమె చెయ్యిని తొలగించాల్సి వస్తుందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నెత్తిపై కత్తితో పదే పదే నరకడం వల్ల పూర్తిగా తల మొత్తం ఉబ్బినట్లు తెలిపారు. లన్స్‌కు కూడా గాయమైనట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఆఫరేషన్ చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని కోరడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి రెఫర్ చేసినట్లు తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles