పది నెలలు తిరిగినా పట్టా మారలే..

Fri,April 19, 2019 03:37 AM

- తన పొలం ఇక రాదనే దిగాలుతో రైతు మృతి
- పట్టాభూమి మార్పులో వీఆర్‌వో నిర్లక్ష్యం
- రైతు ఫొటోతో కుటుంబీకులు, బంధువుల రాస్తారోకో..

లింగాల : భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఓ రై తుకు చెందిన భూమిని అధికారులు అన్నదమ్ముల పేరిట పట్టా చేశారు. దీంతో దిగాలు చెందిన రైతు తనకు ఇంక పొలం రాదనే ఇటీవల చనిపోయాడు. చివరకు రైతుబం ధు, రైతు బీమా కూడా అందకపోవడంతో గు రువారం సదరు రైతు కుటుంబం మృతిడి ఫొటోతో రాస్తారోకో చేసి న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్‌పల్లిలో చోటుచేసుకుంది. అం బట్‌పల్లికి చెందిన గుంటి వెంకటయ్య అనే రైతు పట్టా భూమి సర్వేనంబరు 330లో 3-37 ఎకరాలు ఉంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వెంకట య్య తోబుట్టులైన నిర్మలయ్య, బంగారయ్య, లక్ష్మయ్య, నిరంజన్ నలుగురి పేరిట అమలు చేయగా వారికి పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు సాయం కూ డా అందింది. కాగా ఈ విషయం తెలుసుకున్న వెంకట య్య అధికారుల తప్పిదాలను ఏకరువు పెట్టారు. 2018 జూన్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తూ వచ్చారు. 10నెలలు దాటినా వీఆర్‌వో కాశన్న నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతుపేరిట పట్టారాలేదు. రైతుబంధు సాయం కూడా అందలేదు. ఇంక ఎప్పటికీ తన పొలం రాదనే బెంగతో ఈ నెల 8న రైతు వెంకటయ్య చనిపోయాడు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతుబంధు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయింది. తన అన్న పేరిట ఉన్న భూమి తమ పేరిట మార్పు చే యడం తప్పేనని అట్టి భూమిని అన్న కుమారుల ము గ్గురి పేరిట మార్పు చే యాలని తోబట్టువులు దరఖాస్తు పెట్టుకున్నా నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో మృతుని కు టుంబం పిల్లాపాపలతో కలిసి గురువారం రోడ్డెక్కారు. లింగాల తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట వెంకటయ్య భార్య చంద్రమ్మ తన భర్త ఫొటోతో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ శరబందు వివరణ ఇస్తూ వీఆర్‌వో నిర్లక్ష్యం జరిగిందని, చనిపోయిన రైతు వెంకటయ్య ముగ్గురు కుమారుల పేరిట అట్టి భూమిని మార్పు చేస్తామని చెప్పారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles