మంచి సమాజం కోసం కృషి చేద్దాం

Thu,April 18, 2019 12:33 AM

- ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం
- ఎస్పీ లక్ష్మీనాయక్
వడ్డేపల్లి: మంచి సమాజం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ లక్ష్మీనాయక్ అ న్నారు. మన రక్షణ- మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బుధవారం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ లక్ష్మీనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థన స్థలాల వద్ద మంచి వాతావరణం కల్పించడం కోసం, భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ము ఖ్యంగా ప్రార్థనా మందిరం, ఆలయాల్లో హుండీల దొంగతనాలు, విగ్రహాల దొంగతనాలు అరికట్టవచ్చునని, వాటి పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమా లు జరగకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వ ల్ల ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని నేరాలను అదుపు చేయవచ్చని, దీనికి ప్ర జలు సహకరించాలన్నారు.

అనంతరం సీఐ గురునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే శాంతినగర్, రాజోళి, అయిజ, మానవపాడు తదితర మండలాల్లో ప్రధాన వీధుల్లో, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్‌ఐ మహేందర్ మాట్లాడుతూ సీసీ కె మెరాల ఏర్పాటు వల్ల ఇప్పటికే పలు కేసు ల్లో శాంతి నగర్‌లోని ప్రధాన వీధుల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా సాక్ష్యాలను సంపాందించి నేరం చేసిన వాళ్లను గు ర్తించి కేసులు నమోదు చేశామన్నారు. అంతకు ముం దు చర్చి, దేవాలయాలు, మసీదుల నిర్వాహకులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు మాట్లాడారు. శాంతిభద్రతల దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటును అవసరాన్ని వారు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స ర్పం చులు, గ్రామస్తులు, సిబ్బంది ఏఎస్‌ఐ నరసింహారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజవర్ధన్ రెడ్డి, వెంకప్ప, జ్యోతికాంత్ తదిత రులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles