పని చేస్తారా వెళ్లిపోతారా..

Thu,April 18, 2019 12:32 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాధి కూలీలకు పనికల్పించడంలో ఏపీవోలు విఫలమవుతున్నారని పని చేస్తే ఉండండి లేదంటే వెళ్లిపోండి పనిచేయనప్పుడు, ఉద్యోగం, జీతాలు ఎందుకని ఉపాధి హామీ సిబ్బందిపై డీఆర్‌డీవో జ్యోతి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో జిల్లాలోని ఏపీడీలు, పీవోలు, ఈసీ, టీఏలతో ఉపాధి హామీపనుల జరుగుతున్న తీరు, జిల్లాలో నిర్మితమవుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల ని ర్మాణం తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ఎవరూ వలస పోకూడదని అందుకోసం ప్రతి గ్రా మంలో 100మందికి ఖచ్చితంగా పని కల్పించాలన్నారు.అవసరమైతే ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించి వలస లు నివారించాలని సూచించారు. ప్రభు త్వం హరితహారం కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుందని ఉపాధిహామీ సిబ్బంది వల్ల ఎక్కడ కూడా నర్సరీలు పూర్తి స్థాయిలో నాణ్యతతో సిద్ధం లేవన్నారు. గ్రామాల్లో నర్సరీల పెంపకంలో విత్తనాలు నాటే సమయంలో వాడే మట్టి మంచిది వాడడం లేదని దీని వల్ల మొక్క లు అనుకున్న స్థాయిలో ఎదగడం లేదన్నారు. ప్రభుత్వం మొక్కల పెంపకానికి కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్న మీ మూ లంగా ఆ నిధులు వృథా కావడంతో పా టు అనుకున్న స్థాయిలో కూలీలకు పని కల్పించక పోవడం వల్ల జిల్లాకు వచ్చిన నిధులు ఆగిపోతున్నాయన్నారు.

ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు తప్పని సరిగా మూడు రోజుల్లో వారు చేసిన పనులకు వేతనాలు వారి ఖాతాలో జమ చేయాలని అలా జమ చేయని సి బ్బందిపై చర్యలు తీసు కుంటానని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు సంబంధించి వారి వేతనాలు సస్పెండ్ ఖాతాలకు ఎం దుకు జమ అవుతున్నాయని ఏపీవోలను ప్రశ్నించారు. వెంటనే సస్పెండ్ ఖతాలో ఉన్న నగదును పని చేసిన కూలీల ఖాతాలను సరిచేసి వారి ఖాతాలో జమచేయాలని సూచించారు. నర్సరీలలో కలుపు మొక్కలు తీయకపోతే మొక్కలు ఎలా పె రుగుతాయని ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి అధికారులు, సిబ్బంది వెంటనే కలుపు మొ క్కలు తీయించాలని ఆదేశించారు. సమావేశానికి రాని ఏపీవోలకు షోకాజ్ నోటిసులు జారీ చేయాలని ఆదేశించారు. ఏపీడీలు ఉపాధిహామీ, వ్యక్తిగత మరుగుదొ డ్లు, నర్సరీలలో మొక్కల పెంపకంపై క్లష్ట ర్ల వారీగా నివేదిక ఇవ్వాలని సూచించా రు. నెల రోజుల్లో 4వేల వ్యక్తిగత మరుగుదొడ్లు జిల్లాలో నిర్మించామని చెప్పారు. అధికారులు అదే స్ఫూర్తితో పని చేసి జూన్ రెండో తేది నాటికి జోగుళాంబ గ ద్వాల జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించడానికి అందరూ అధికారులు కృషి చే యాలన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 15రోజుల్లో మ రో సారి సమావేశం నిర్వ హిస్తామని అ ప్పటి వరకు సిబ్బంది పూర్తి స్థాయి నివేదికతో సమావేశానికి హాజరు కావాలని సూ చించారు. ఈ సమావేశంలో ఏపీడీలు సు ల్తాన్, నాగలింగచారి ఉపాధిహామి సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.

132
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles