జ్ఞానాన్ని పంచడంలో .. అలంపూర్ ముందుండాలి

Thu,April 18, 2019 12:32 AM

- తెలంగాణలో విద్యా రంగం ఎంతో అభివృద్ధి సాధించాలి
- నాన్‌లోకల్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా..
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ప్రయాగ్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే

ఉండవెల్లి : విద్యార్థులకు జ్ఞానంను పంచడంలో అలంపూర్ ఎప్పటికీ ముం దుం డాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మం డలం లోని అలంపూర్ చౌరస్తాలో ప్రయాగ్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలను మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే డా. వీఎం అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్, భద్రాచలంలోని విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఆధారపడి చదువులు కొన్నసాగిస్తున్నారని దీంతో తెలంగాణ రాష్ట్రంలో విద్యా ర్థులు నాన్‌లోకల్‌గా మిగిలిపోతున్నారన్నారు. తాను ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడిగా ఉన్నప్పుడే నాన్‌లోకల్ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే నాన్‌లోకల్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉం దన్నారు. ప్రయాగ్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ యాజమాన్యం వారు విద్యను వ్యాపా రంగా కాకుండా ఈ ప్రాంతంపై ఉన్న ప్రత్యేక ఆసక్తితోనే పాఠశాలను ప్రారంభించి తక్కువ ఖర్చుతోనే విద్యను అందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అబ్ర హం మాట్లాడుతూ ప్రయాగ్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ యాజమాన్యం తక్కువ ఖర్చు తో విద్యను అందించడం ఎంతో శుభదాయకమన్నారు. ఈ కా ర్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయ కులు సుదర్శన్‌గౌడ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నర్సన్ గౌడ్, జయరాములు పాఠశాల కరస్పాండెంట్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles