కలిసికట్టుగా పని చేద్దాం

Thu,April 18, 2019 12:31 AM

- రాబోయే కాలంలో పార్టీలో ప్రతి ఒక్కరికీ న్యాయం
- ప్రతి ఒక్కరూ ఓ సైనికుల్లా పని చేసి ఐక్యతను చాటాలి
- ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వీఎం అబ్రహం

అలంపూర్,నమస్తే తెలంగాణ : రానున్న ఎన్నికల్లో కార్యకర్తల్లో, నాయకుల్లో అంతర్గంతంగా ఉన్న వర్గపోరుకు స్వస్తి చెప్పి, కలిసికట్టు ఉంటూ పార్టీ అధిష్టానం ఆదేశాలు, సూచనల మేరకు పని చేసి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకుందామని అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఇటిక్యా ల మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాం పు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తు టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందన్నారు. అదే తరహాలో వచ్చే ఎన్నికల్లో కూడా మెజార్టీయే లక్ష్యం గా నాయకులు, కార్యకర్తలు పని చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని ఎప్పుడు అధిష్టానం విస్మరించదన్నా రు. రాబోయే కాలంలో పార్టీలో అం దరికి న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అలంపూర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని అం దుకని జడ్పీచైర్మన్ పదవి కూడా అ లంపూర్ నియోజకవర్గ జడ్పీటీసీలకే కేటాయించబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles