రేవల్లిలో బాల్య వివాహం నిలిపివేత

Thu,April 18, 2019 12:31 AM

- రంగంలోకి దిగిన బాలికా సంరక్షణ అధికారులు
- వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్

రేవల్లి : మండల కేంద్రం రేవల్లిలో బాల్య వివాహం జరుగుతుందని తెలిసి బుధవారం బాలికా సంరక్షణ జిల్లా అధికారులు ఆ వివాహాన్ని నిలిపివేశారు. అందుకు సంబంధించిన సమాచారం ప్రకా రం.. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిళ్లకు చెందిన రమేశ్‌తో వివాహాన్ని నిశ్చయించాడు. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం అందరూ పెళ్లి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లి కూతురు బంధువులు, గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని బాలికా సంరక్షణ జిల్లా అధికారులకు సమాచారం రావడంతో ఆ శాఖ అధికారి రాంబాబు, జిల్లా ఐసీడీఎస్ సీడీపీవో పుష్ప చైతన్యతో కలిసి గ్రామానికి చేరుకుని బాల్య వివాహాన్ని నిలిపివేశారు. స్థానిక తహసీల్దార్ లక్ష్మన్‌రావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్‌కు సమాచారమిచ్చారు. అనంతరం వారు వధువరుల తల్లిదండ్రులు, బంధువులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్రాయంలోనే వివాహాలు చేస్తే పిల్లలకు శారీరక సమస్యలు, రోగాలు వస్తాయ్నరు. వయస్సు రాకుండానే పెళ్లి చేయడం చట్టరిత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles