పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి

Wed,April 17, 2019 12:35 AM

-ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తాం
-కష్టపడే కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం
-ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి : ప్రతి కార్యకర్తా క్రమశిక్షణతో మెలిగి టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు సూచించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యయలంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం వివిధ గ్రామాల, మండలాల నాయకుల నుంచి వచ్చిన కార్యకర్తల నుంచి అభిఫ్రాయాలను సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ నియోజక వర్గంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలు, 72 ఎంపీటీసీ స్థానాలున్నాయన్నారు. నియోజక వర్గంలో పూర్తి స్థాయి మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని పార్టీ గుర్తించి వారికి సముచిత న్యాయం చేస్తుందన్నారు. అలంపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కనుకనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అలంపూర్ అభివృద్ధి చేయడంలో భాగంగానే జెడ్పీ చైర్మన్ పదవిని అలంపూర్ నియోజక వర్గానికి కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంతో అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. ఎన్నికల కోడ్ మూగిసిన వెంటనే ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, జెడ్పీ ఛైర్మన్ నిధులతో అలంపూర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంకూరు శ్రీనివాస్‌రెడ్డి, రోశన్న, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పల్లెపాడు శంకర్‌రెడ్డి, బొరెల్లి సత్యరెడ్డి, భైరాపురం వెంకట రమణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles