నిందితులకు జరిమానా

Wed,April 17, 2019 12:35 AM

గద్వాల క్రైం : భవిష్యత్తులో తాము ఎలాంటి గొడవలకు వెళ్లబోమని పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని రెవెన్యూ అధికారుల ముందు పోలీసులు బైండోవర్ చేసినప్పటికీ వారు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి గద్వాల మండల రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గద్వాల మండలం పూడూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. వారిని అప్పటి తాహసీల్దార్ ముందు గద్వాల రూరల్ పోలీసులు బైండోవర్ చేశారు. అయితే వారిలో బోయ ఈశ్వర్ జంగంపల్లి గ్రామంలో జరిగిన మరో ఘటనలో జోక్యం చేసుకొని బైండోవర్ నియమాలు ఉల్లం ఘించాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు మంగళవారం ఈశ్వర్‌కు రూ.50 వేల జరిమానా విధించారు. అదే విధంగా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో పంచాయతీ గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామానికి ఇద్దరిని బైండోవర్ చేశారు. ఆ ఇద్దరిలో విష్ణువర్ధన్‌రెడ్డి గద్వాల టౌన్ పోలీసు స్టేషన్‌లో మరో కేసులో జోక్యం చేసుకోవడంతో ఆయనకు అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయగా వారిలో చంద్రశేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలు నిబనంధనలు ఉల్లంగించి మరో కేసులో కలుగజేసుకున్నారని నిర్దాంచిన రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles