పార్లమెంట్ ఎన్నికల్లోనూ రికార్డు సృష్టించాలి

Tue,March 26, 2019 02:25 AM

- ప్రజల ఆశీర్వాదాన్ని ఎప్పటికీ మరువలేను
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- నియోజక వర్గం నుంచి అధిక మెజార్టీనిద్దాం
- జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్
- గద్వాలలో టీఆర్‌ఎస్ మండల కార్యకర్తల సమావేశం

గద్వాల రూరల్ : అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధిక మెజారిటీని సాధించి, రికార్డు సృష్టించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంకేఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన గద్వాల మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా కష్టపడ్డారో అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో పని చేసి అధిక మెజార్టీని మండలం నుంచి ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. గద్వాల మండల పరిధిలోని కార్యకర్తలను జీవితంలో ఎప్పటికీ మరుమజాలనని, వారి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ, అనతి కాలంలోనే దేశంలోనే సంచలనాలు సృష్టించిందన్నారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం రికార్డు స్థాయిలో మెజార్టీ సాధిస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయిన తక్కువ సమయంలోనే, దేశమంతా తెలంగాణ వైపు చూసేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలు సైతం ఆదర్శంగా తీసుకుంటూ అనుసరించడమే కేసీఆర్ దీక్షాదక్షతకు నిదర్శనం అన్నారు. గట్టు ప్రాంతాన్ని సస్య శ్యామలం చేయడానికి రూ.584 కోట్ల వ్యయంతో రైతులకు రెండు పంటలకు నీరందించడానికి సీఎం కేసీఆర్ 15 టీఎం సీల గట్టు ఎత్తిపోతల పథకానికి సర్వేలు ప్రారంభించా మన్నారు.

అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జిల్లా నుంచి అధిక మెజార్టీని సాధించి ఎంపీ అభ్యర్థి పోతు గంటి రాములును గెలిపించాలని కోరారు. 70 ఏళ్లలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితులు జిల్లాలో ఏర్పడ్డాయని చెప్పారు. కార్యకర్తలందరూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కన్జూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీ అందించి, మన శాసన సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పార్టీ మనుగడకు కార్యకర్తలే మూలాధారమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ నాయుడు, ఎంపీపీ సుభాన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పర్మాల నాగరాజు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ప్రతాప్‌గౌడ్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles