ఢిల్లీ పీఠాన్ని కదిలించాలి

Tue,March 26, 2019 02:23 AM

- తెలంగాణ సత్తా మరోసారి రుజువుచేద్దాం
- రాములును అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం
- ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం
- శాంతినగర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశం

వడ్డేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన పథకాలు పలు రాష్రాల వాళ్ళు చివరకు నరేంద్రమోడీ కూడా కాపీ కొట్టి ప్రజాధరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. మండల కేంద్రంలోని శాంతినగర్‌లో భవాని ఫంక్షన్ హాల్‌లో సోమవారం రాత్రి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే అబ్రహం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన పథకాలు ప్రజాధారణ పొంది సీఎంగా కేసీఆర్‌ను రెండవ సారి ఎన్నుకున్నారని మీ మద్దతుతో ఆయన డిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారన్నారు. ఢిల్లీ ఫీఠాన్ని కదిలించేందుకు మీరు సైనికుల్లా పని చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ అయిందని, ఆ పార్టీకి ఓటు వేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. అలంపూర్, గద్వాల నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ అరంగ్రేటం చేశాడన్నారు. అలంపూర్ నియోజక వర్గంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వందల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నూతన గ్రామ పంచాయతీలు, రోడ్లు, భవనాలు, రైతుబంధు, పింఛన్లు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇలా అనేక పథకాలు అమలు పరచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మొదట్లో హేళన చేసిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయన్నారు. అనంతరం వైస్ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాసులు, ఆర్డీస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యేకు భారీ మెజారిటీ ఇచ్చి అలంపూర్ చరిత్రలో ఒక రికార్డు అందించారని, అదే ఆధరణ ఎంపీ రాములుపై చూపి గెలిపించుకుందామని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడు, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles