టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు

Tue,March 26, 2019 02:23 AM

గట్టు : టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల మండల టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాన్ని గద్వాల పట్టణంలోని ఎంకేఎస్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో అంతంపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇరవై మంది దాకా కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో చిన్నోనిపల్లి కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్‌గా పోటీ చేసి పరాజయం పొందిన పోతురాజు ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యుడు మల్దకల్, నాగేశ, ఎర్రన్న, బూదెన్న, ఎర్ర సత్యం, మల్దకల్ తదితరులు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజక వర్గంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. గద్వాల నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థి రాములుకు భారీ మెజార్టీని అందించాలని కోరారు. దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు ఆకర్షితులయ్యేటట్లు చూడాలన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర కన్జూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, మిట్టదొడ్డి సర్పంచ్ షడ్రిక్, జే.వీరేశ్ పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో
గద్వాల రూరల్ : జిల్లా కేంద్రంలోని ఎంకేఎస్ పంక్షన్‌లో సోమవారం జరిగిన గద్వాల మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్‌రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న పనితీరు నచ్చక, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వీరాపురం సర్పంచ్ స్వప్న, అనంతపురం, పర్మాల, గట్టు మండలానికి చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles