ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన విద్య

Tue,March 26, 2019 02:22 AM

- లెక్చరర్ చంద్రశేఖర్
- ప్రభుత్వ కళాశాలలోచేరాలని ప్రచారం
గట్టు/కేటీదొడ్డి : ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు లెక్చరర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట జెడ్పీ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులతో గట్టు కళాశాల లెక్చరర్ల సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్చరర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయివేట్ కళాశాలల వైపు ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఆ కళాశాలల యాజమాన్యాలు చెప్పే కల్లబొల్లి మాటలు వినవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉంటారని, దీనివల్ల బోధన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉంటుం దన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అందే ఉచిత సౌక ర్యాలు ప్రయివేట్ కళాశాలల్లో అందవన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఆగస్టీన్, లెక్చరర్ శ్యాంసుందర్, మోహన్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles