4,58,260

Tue,March 26, 2019 02:22 AM

- ఓటర్ల తుది జాబితా విడుదల
- పురుషులు 2,27,725, స్త్రీలు 2,30,527, ఇతరులు 8
- నూతన ఓటర్లు 12,252మంది
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతనంగా నమోదు చేయబడిన ఓటర్లతో కలిపి ఓటర్ల తుదిజాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని వారికి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించి వారందికీ ఓటు హక్కును జారీ చేసింది.

జిల్లాలో 4,58,260మంది ఓటర్లు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఓటు హక్కు ను కల్పించింది. శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 4,58,260మంది ఓటర్లు ఉన్నట్టుగా ప్రకటించింది. వీటిలో గద్వాల నియోజకవర్గంలో 2,34,920మంది ఓటర్లు, అలంపూర్ నియోజకవర్గంలో 2,23,340మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. ఓటు హక్కులేని పౌరులకు ఫారం-6 ద్వారా ఆన్‌లైన్‌లో, తహసీల్దారు కార్యాలయాల్లో నూతన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో నూతనంగా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 2018-19 సంవత్సరంలో మొత్తం 12,252 మంది నూతన ఓటర్లు ఓటు హక్కు పొందారు.

నియోజకవర్గాల స్త్రీ, పురుష ఓటర్లు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లలో పురుషులు 2,27,725, స్త్రీలు 2,30,527, ఇతరులు 8 ఉన్నారు. వీరిలో గద్వాల నియోజకవర్గంలో మొత్తం 2,34,783మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,16,398 మంది, స్త్రీలు 1,18517 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో పురుషులు 1,11,327మంది, స్త్రీలు 1,12010మంది ఇతరులు ముగ్గురు ఉన్నట్టుగా ప్రకటించారు.

చట్టబద్ధమైన సమస్యలు పరిష్కారం : ఏఎస్పీ
గద్వాల క్రైం : వివిధ సంఘటనలకు సంబంధించి చట్ట బద్దమైన ఏ సమస్యకైనా విచారణ జరిపి తప్పకుండా పరిష్కారం చూపుతామని ఏఎస్పీ కటుకూరి కృష్ణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం గద్వాలలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులతో ఏఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారెదు ర్కొంటున్న పరిష్కారం కానీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంఘటనలకు సంబంధించిన 6 ఫిర్యాదుల ను పరిశీలించిన ఏఎస్పీ వాటిని విచా రణ అనంతరం పరిష్కారం చేయాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఆదేశించారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles