బాధ్యతగా విధులు నిర్వహించాలి

Tue,March 26, 2019 02:22 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శశాంక సూచించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా చూడాలని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం 2050మంది ఉద్యోగులకు విధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, మరో 350మంది వరకు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ అవసరాన్ని బట్టి ఎన్నికల ధ్రువీకరణ పత్రం లేదా పోస్టల్ బ్యాలెట్ అందించేందుకు పకడ్బందీ ప్రణాళిక చేయాలన్నారు. ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులను గుర్తించి వారికి ఎన్నికల రోజున ఓటర్లు వరుస క్రమంలో నిలబెట్టేందుకు విధులు కేటాయించాలని మ్యాన్‌పవర్ నోడల్ అధికారిని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో రాజీ పడొద్దని, నియోజకవర్గానికి సంబంధించిన నోడల్ అధికారి ప్రతిరోజు ఫ్లయింగ్ స్కాడ్, ఎన్నికల వ్యయ నిర్ధారణ కమిటీ లేదా స్టాటికల్‌టీం వెంట తిరిగి వారు తమ విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించాలన్నారు. ఎంసీసీ పర్యవేక్షణ సిబ్బంది అందరూ సీ-విజిల్ యాప్‌ను తమ మోబైల్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సీ-విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులను రెండు గంటల్లోగా పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉంచుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles