క్షయవ్యాధిని పారద్రోలుదాం

Mon,March 25, 2019 03:03 AM

గద్వాల, నమస్తేతెలంగాణ: జోగులాంబ గద్వాల జిల్లా నుంచి క్షయవ్యాధిని సమూ లంగా పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ శశాంక ప్రజలకు పిలుపు నిచ్చారు. మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురష్కరించుకుని జిల్లా కేంద్రంలోని కృష్ణవేణిచౌరస్తా నుండి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి అవగాహానకై ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి సకాలంలో గుర్తించి రోగులకు పూర్తిస్థాయి మందులను సరఫరా చేయడంలో జోగులాంబ గద్వాల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇది ఇలాగే కొనసాగాలని సూచించారు. అనుమానం ఉన్న వారికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వారికి పూర్తి స్థాయి డాట్ మందులు ఉచితంగా సరఫరా చేసి వారికి పౌష్టికఆహారానికి సైతం నెలకు ఇచ్చే రూ. 500పోషణ భత్యం వ్యాధి నయం అయ్యే వరకు అందజేయాలన్నారు.క్షయ వ్యాధి పూర్తిగా నివారించదగ్గ వ్యాధని ఒక సారి పూర్తికాలం డాట్ మందులు వాడితే ఇక జీవితంలో ఎక్కడ తిరిగి రాదన్నారు. కాబట్టి మందులను మద్యలో ఆపకుండా డాట్ మందులు షెడ్యూల్ పూర్తయ్యే వరకు వాడాలన్నారు. ఈ వ్యాధిని నిర్మూలించుటలో ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు అందరూ ముం దుకు వచ్చి ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి జిల్లా నుంచి పూర్తిగా పారద్రోలే విధంగా చూడాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేంద్రకుమార్, డాక్టర్లు సునీత, శశిరేఖ తో పాటు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ర్యాలీలో పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles