నీటి సమస్య రావొద్దు

Mon,March 25, 2019 03:03 AM

గద్వాల, నమస్తేతెలంగాణ: వచ్చే మూడు మాసాలు చాలా కీలకమైనవని జిల్లాలో మంచి నీటి సమస్య తలెత్త కు ండా చూసేందుకు అధికారులు పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ శశాంక మిషన్‌భగీరథ అధికారులను ఆదేశించారు. ఆదివారం వాటర్‌గ్రిడ్ అధికారులతో కలిసి జూ రాల వాటర్ పంపింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వేసవిలో జిల్లా కు సరిపడా నీటి నిల్వ జూరాలలో ఏ విధ ంగా ఉందనే విషయాలను అధికారుల ను అడిగి తెలుసుకుని అక్కడ నీటి సా మర్థ్యాన్ని పరిశీలించారు. నీటి లభ్యత మరింత తగ్గితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రతి రోజు సరఫరా అవుతున్న నీటి నాణ్యత ను పర్యవేక్షించాలని, ఇంజినీరు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పర్యవేక్షి స్తూ ఉండాలని అప్పుడప్పుడు కార్య నిర్వాహక ఇంజనీరు సైతం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒకనిమిషం మోట ర్ ఆగితే అవి తిరిగి ప్రారంభం కావడానికి అరగంట పడుతుందని అక్కడ ను ంచి నీరు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు చే రాలంటే గంటల సమయం పడుతుందన్నారు. ఆలోపు ఆ ఊరి నుంచి వేరే ఊ రికి పంపింగ్ డైవర్టు చేయడం జరుగుతుందని దాని మూలంగా ఆ ఊరిలో ఆరోజు నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందువల్లఎట్టిపరిస్థితిలో పంప్‌హౌజ్‌మోటర్లకు నిరంతర విద్యు త్ సౌకర్యం ఉండాలని అందుకు విద్యు త్ అధికారులను అప్రమత్తం చేయాల ని సూచించారు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకుల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి హాబిటేషన్‌కుమంచినీరు సరఫరా అయ్యే విధం గా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్‌హెడ్‌ట్యాంకులపై డీఈ, లైన్‌మెన్, పే ర్లు, ఫోన్ నంబర్లు పేయింటింగ్ వేయి ంచాలని సూచించారు. కలెక్టర్ వెంట మిషన్‌భగరథ ఎస్‌ఈ జగన్‌మోహన్, ఇంజినీర్ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles