శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

Mon,March 25, 2019 03:03 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: ప్రిసైడింగ్, సహాయప్రిసైడింగ్ అధికారులు తమకు జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకుల ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధికారులకు వాఏ చిన్న అనుమానం వచ్చిన వెంటనే నివృత్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక సూ చించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఎంఏఎల్‌డి డిగ్రీ కళాశాల లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ని ప్రిసైడింగ్, సహాయప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మొదటి స్థా యి ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల రోజున ప్రిసైడింగ్ అధికారులు చేసే చిన్న పొరపాట్లవల్ల అధికారులు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో అలా ంటి తప్పులకు తావు ఇవ్వకుండా ఇక్క డే ప్రాక్టికల్‌గా అభ్యసన చేసుకోవాలన్నారు. ఇటివల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు 95శాతం ప్రిసైడింగ్, సహాయప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడంతో ఎన్నికలు విజయవంతమయ్యాయన్నా రు.

అధికారులు ముఖ్యంగా ఫారం-17, 17సి సరిగ్గా పూరించడం, మాక్‌పోల్ నిర్వహణ, పీవో డైరీ ఎలా రా యాలి అనే విషయాలు అర్థమయ్యేలా నేర్చుకో వాలని సూచించారు. ఎన్నిక లు పూర్తి అయినా తర్వాత సీఆర్‌సీ చే యకపోవడం, సీల్ సరిగా వేయకపోవడంతో పాటు ప్రారంభంలోనే ఈవీఎంల కనెక్షన్లు సరిగా ఇవ్వక పోవడం తో అవి పని చేయలేదని మార్చడం వ ంటి తప్పులు చేయడం జరిగిందన్నా రు. అందువల్లనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఏఫ్రిల్ మొదటి వారంలో రెండోస్థాయి శిక్షణ కార్యక్ర మం ఏర్పాటు చేస్తామని అప్పుడైనా అన్ని అనుమానాలు నివృత్తి చేసుకుని ఎన్నికల రోజున పూర్తి విశ్వాసంతో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ము ఖ్యంగా ఫారం-17లో మొత్తం ఎన్ని ఓ ట్లు పోలుఅయ్యాయి అందులో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అనే విషయాలతో పాటు దివ్యాంగులు ఎంతమంది ఓట్లు వేశారో, థర్డ్‌జెండర్లు ఎంత మంది ఓటు వేశారనే విషయా లు ఖచ్చితంగా గుర్తించాలన్నారు. అ ప్పుడే ఫారం-17,1 7సి పీవో డైరి సరిపోయిందా లేదా చూసుకునే అవకాశం వస్తుందన్నారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రెండో స్థాయి శిక్షణలో మారోసారి నివృత్తి చేసుకోవాలని సూ చించారు. అదేవిధంగా ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్నికాపాడాలి అనే మ నం అందరం చెబుతూనే ఎన్నికల సి బ్బంది తమ ఓటు వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగి ఖ చ్చితంగా పోస్టల్ బ్యాలట్‌పై ఫారం-12లేదా, 12ఏ పూరించి తప్పకుండా ఇవ్వాలన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకపరిధిలో ఓటు ఉంటే ఫారం-12ఏ ఇవ్వాలని ఇతర నియోజకవర్గంలో ఉంటే ఫారం-12 పూ రించి ఇవ్వాలన్నారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ ఎన్నికల్లో ఎలాంటి త ప్పులు చేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles