ప్రాజెక్టులు పూర్తి చేసి.. నా బాధ్యత నెరవేరుస్తా

Sun,March 24, 2019 01:11 AM

- గద్వాల-మాచర్ల రైల్వేకు కృషి
- ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు
- నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు
- గట్టు కల నెరవేరబోతుంది..
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- ఫెడరల్ ఫ్రంట్‌ది కీలకపాత్ర
- అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
- నడిగడ్డ నుంచే భారీ మెజార్టీని అందిస్తాం..
- జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్
- మల్దకల్, అయిజ, ఇటిక్యాలలో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
- పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథం ప్రారంభం

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి/గద్వాల నమస్తే తెలంగాణ/అయిజ/ మల్దకల్/ఇటిక్యాల : ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కావలసిన అనుమతులు, నిధులను తీసుకొచ్చి, వాటిని పూర్తి చేసి తన బాధ్యతను నెరవేరుస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. శనివారం మల్దకల్, ఇటిక్యాల, అయిజ మండలాల్లో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయగా ఎంపీ అభ్యర్థి పీ.రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, వీఎం అబ్రహం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సభల్లో ఎంపీ అభ్యర్థి రాములు మాట్లాడారు.

రాజకీయం అంటే ప్రజాసేవ చేయడమే కర్తవ్యం.. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తే ప్రజల మన్ననలు గెలుపొందుతారు.. ప్రజల నడుమ ఉంటూ ప్రజాసేవకే అంకింతమయితే రాజకీ యంగా ఎల్లకాలం మనుగడ సాధ్యం అవుతదని రాములు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో అభ్యర్థిగా మీముందుకు వచ్చిన తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపితే నడిగడ్డను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని రాములు స్ఫష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడన్నారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో కీలకభూమిక పోషించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించేందుకు కృతనిశ్చ యంతో ఉన్నారన్నారు. కారు .. కేసీఆర్ .. 16 స్థానాల గెలుపే లక్ష్యం సీఎం కేసీఆర్ అభిమత మని, అందుకనుగుణంగా కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి భారీ మెజార్టీ దిశగా కృషి చేయాల న్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు స్థానికేతరులని, వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. నాగర్‌కర్నూల్‌లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో మనుగడలేదన్నారు. నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుతో అలంపూర్ నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికలు పూర్తికాగానే పెండింగ్ ప్రాజెక్టులపై స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో దృష్టి పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. నడిగడ్డ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. కార్యకర్తలు 15 రోజులు కష్టపడి భారీ మెజార్టీని సాధించాలన్నారు. ఏఫ్రిల్ 11న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకి పడేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత తిరుమల్‌రెడ్డి సహకారంతో అయిజ పట్టణంతో పాటు మండలాన్ని అభివృద్ధి చేసుకుందా మన్నారు.

ఇటిక్యాల మండలం జింకలపల్లెలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 31న, వనపర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఉంటుందని నియోజకవర్గంనుండి 25 వేలకు తగ్గకుండా కార్యకర్తలు సాయంకాలం 4గంటలలోపు తరలిరావాలన్నారు. మల్దకల్‌లోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని పార్లమెంట్ అభ్యర్థి రాములు పేర్కొన్నారు. భగవంతుని కృపతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆలయ అభివృద్దికి గానూ తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని విఠాలపురం గ్రామంలో పనులకు వెళ్తున్న కూలీలను పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థి కోరారు.

విడదీయలేని సంబంధం
- అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం
జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజక వర్గాలను విడదీయలేని సంబంధమని, రెండు నియోజక వర్గాలతో కలిసిన నడిగడ్డను సీఎం కేసీఆర్ సారధ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఏ ఎన్నికలు జరిగినా నడిగడ్డలో ఏకపక్షంగా ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడటం ఖాయ మన్నారు. గద్వాల నియోజక వర్గానికి ధీటుగా అలంపూర్‌లో సైతం పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అలంపూర్ నియోజక వర్గంలో అన్ని మండలాల కంటే ఎక్కువ మొత్తంలో అయిజ మండలం నుంచి భారీ మెజార్టీని అందించేందుకు కార్య కర్తలు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించిన ఘనత అయిజకు దక్కిందన్నారు.

రాజకీయంలో ఆటుపోట్లు సహజం
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
రాజకీయంలో ఆటుపోట్లు సహజమని, ఆటు పోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే ప్రజల్లో ఆదరాభిమానాలు సంపాదించుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. 35 ఏళ్లుగా టీఆర్‌ఎస్ నేత తిరుమల్ రెడ్డితో కలిసి రాజకీయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈనాడు ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికై సేవ చేస్తున్నామన్నారు. కార్య కర్తలను కాపాడుకోవడంలో నాయకులు ముం దుంటారన్నారు. పార్టీకి సేవ చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు నేతల సహకారం ఉంటుందన్నారు. అధైర్యపడకుండా పార్టీని, నాయకులను నమ్ముకుని పని చేయాలని కార్యకర్తలకు పిలునిచ్చారు. గద్వాల నియోజకవర్గం కంటే అలంపూర్‌లోనే ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీని అందించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించి నడిగడ్డను అభివృద్ధి చేసుకుంటాదన్నారు.

నడిగడ్డ నుంచే భారీ మెజార్టీ ఇస్తాం
- జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్
నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాములుకు నడిగడ్డ నుంచి భారీ మెజార్టీని అందించి, సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను అందిం చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేల సహకారంతో నడిగడ్డ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీపీలు సుందర్‌రాజు, సుభాన్, పీఏసీఎస్ అధ్యక్షుడు రాముడు, చైర్ పర్సన్ రాజేశ్వరి, గట్టు వైస్ ఎంపీపీ విజయ్, మాజీ ఎంపీపీ సీతారాంరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles