ముందు చూపే మందు

Sun,March 24, 2019 01:09 AM

- చాపకింది నీరులా విస్తరిస్తున్న క్షయ వ్యాధి
- అందుబాటులో మందులు
- రోగులకు ప్రతి నెలా రూ.500 పంపిణీ
- మందులు తప్పక వాడాలి
- నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు అవగాహన ర్యాలీ
గద్వాల టౌన్: అపరిశుభ్రం, కాలుష్యం.. వెరసి వ్యాధులు.. అపరిశుభ్రత, కాలుష్యం వల్ల వచ్చే రోగాల్లో అతి ప్రమాదకరమైంది క్షయ.. ఈ వ్యాధి ట్యూబర్ క్యూలోసిన్ అనే మైక్రోబ్యాక్టీరి యా ద్వారా వ్యాపిస్తుంది.. ఒకరి నుంచి మరొకరికి కాకుండా కలు షితమైన నీరు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల తదితర వాహ కాల ద్వారా వ్యా ధి వేగంగా వ్యాపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న చాపకింది నీరులా ఇంకా వ్యాపిస్తునే ఉంది. జిల్లాలో 2018 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు 1197మంది క్షయ వ్యాధిన పడ్డారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 426మంది వ్యాధికి గుర య్యారు. తద్వారా జిల్లాలో వ్యాధి తీవ్రత ఏపాటి ఉందో ఇట్టే అర్థ మవుతుంది.

వ్యాధి లక్షణాలు..
తెమడ లేదా పోడి దగ్గు, సాయంత్రం తీవ్రమైన జ్వరం, తల నొప్పి వస్తుంది. క్రమేణా బరువు తగ్గి పోవడం, తొందరగా అలసి పోవడం, ఆకలి మం దగించడం వంటివి సంభవిస్తాయి. ఇది ఒక అం టు వ్యాధి. వ్యాధి శరీరంలోని ఏ భాగానికైన రావ చ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు వ్యాధి ఎక్కు వగా సోకే అవకాశం ఉంది. వ్యాధికి తగిన చికిత్స చేయించుకోకుంటే మరణించే అవకాశాలు ఉన్నా యి. ప్రతి లక్ష జనాభాలో 200మంది క్షయ వ్యా ధిగ్రస్తులు ఉంటారన్నది వైద్యాధికారుల అం చనా. ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశం లో నే క్షయ వ్యాధి గ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి తీవ్రతను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కా ర్యక్రమాలు చేపడుతున్నాయి.

వ్యాధి మూడు రకాలు..
క్షయ వ్యాధిని మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది కళ్ల(తెమడ)లో క్రిమి కనబడే ఊపిరితి త్తుల క్షయ వ్యాధి ఈ వ్యాధి 90శాతం ఉంటుంది. రెండో రకం తెమడలో క్రిమి లేని ఊపిరితిత్తుల క్ష య ఈ వ్యాధి, మూడో రకం వివిధ భాగాలకు సో కే క్షయ ఇలా మూడు రకాలుగా ఉంటుంది.

వ్యాధి నిర్దారణ కేంద్రాలు..
జిల్లాను మూడు యూనిట్లుగా విభజించారు. గ ద్వాల, అయిజ, అలంపూర్‌లో యూ నిట్లు ఉన్నా యి. అలాగే జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లలో వ్యాధి నిర్దారణ కేంద్రాలు ఉన్నాయి. వాటి లో గద్వాల, ధరూర్, ఉప్పేరు, వడ్డేపల్లి, మానవ పాడు, అలంపూర్‌లలో వ్యాధి నిర్దారణ కేంద్రాలు ఉన్నాయి. ఆయా యూనిట్ల పరిధిలో గుర్తించిన వ్యాధి గ్రస్తులను కేంద్రాలలో పూర్తి స్థాయిలో ప రీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ముదిరినట్లు కనిపిస్తే మరిన్ని పరీక్షలకు హైదరాబాద్ లేదా మహ బూబ్‌న గర్‌లకు పంపిస్తారు.

వైద్యం ఇలా..
వ్యాధిగ్రస్తులను గుర్తించిన తరువాత కొత్త వారికి 6నెలల కోర్సు, రోగం తిరగబడ్డ వారికి 8నెలల కోర్సు, వ్యాధి ముదిరిన వారికి 2సంవత్సాల కో ర్సు ఇవ్వడం జరుగుతుంది. వ్యాధి పూర్తిగా న యం అయ్యే వరకు మందులను పంపిణీ చే స్తారు. ప్రతి రోగికి సోమ, బుధ, శుక్రవారాల్లో మందులను పంపిణీ చేస్తారు. ఈ మం దులను క్రమం తప్పకుండా వాడాలి. రెండు మూడు వా రాలు మందులను వాడిన తరువాత కోర్సును మారుస్తారు. మందులు వాడకుండా ఆపేస్తే మరో 6నెలల వరకు అదనంగా కోర్సును పొడిగిస్తారు.

వ్యాధి గ్రస్తులకు ఆర్థిక సహాయం..
క్షయ వ్యాధి బారిన పడిన నిరుపేదలకు ప్రభు త్వం చేయూత ఇస్తుంది. ఉచిత మందులతో పా టు పోషకాహరం నిమిత్తం ప్రతి నెలా రూ.500 లు రోగి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేసే లా గత ఏడాది ఏఫ్రిల్ నెలలో ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. ఆ మేరకు జిల్లాలోని వ్యాధి గ్రస్తు లందరికి ప్రతి నెల ఒక్కొక్కరికి రూ.500 చొప్పు న ఇప్పటి వరకు రూ. 46లక్షలు అందచేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

అందుబాటులో మెరుగైన మందులు..
క్షయ వ్యాధి నుంచి రోగులను రక్షించేందుకు గా ను మెరుగైన మందులు అందుబా టులో ఉన్నా యి. గతంలో లేని విధంగా ఎంతో ఆధునికతో కూడిన మందులను ఈ ఏడాది ఆరోగ్య శాఖ సర ఫరా చేసింది. ప్రతి రోగిని రోగం నయం అయ్యే వరకు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తారు.

పెరుగుతున్న వ్యాధి..
జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా అధి కారుల లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మొ త్తం 1197మంది క్షయ రోగులు ఉండగా ఈ ఏ డాది జనవరి నుంచి మార్చి 20వరకు 426 మందికి వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. అంటే కేవలం 80రోజుల్లోనే 426మంది, అంటే రోజుకు నలుగురు నుంచి 5గురు వరకు క్షయ వ్యాధిన ప డుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇం దుకు క్షయ వ్యాధిగ్రస్తుడు వ్యాధి నిర్దారణ పరీక్ష లు చేయించుకోక పోవడం ఒకటైతే, వ్యాధి పూర్తి గా నయమయ్యే వరకు మందులు వాడకపోవ డమే మరో కారణమన్నది అధికారులు చెప్తు న్నా రు. వ్యాధి సోకిన వ్యక్తి మందులు పూర్తిగా వాడ కం పోవడం ద్వారా వ్యాధి తిరగబడి ఇతరులకు సోకే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి..
క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అలాగే పరిసరాలను ఎప్పటి కప్పుడు పరిశు భ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తి గత పరిశుభ్రత తప్ప నిసరి పాటించాలి. ఇతరులకు క్షయ వ్యాధిపై అవ గాహన కల్పించాలి. వ్యాధిగ్రస్తులు రోగం నయం అయ్యే వరకు మందులు వాడాలి. తుమ్మిన ప్పుడు, దగ్గినప్పుడు రుమాలును అడ్డుగా పెట్టుకో వాలి. మంచి పోషకాహరం తీసుకోవాలి.

రాష్ట్రంలో మొదటి స్థానం..
క్షయ వ్యాధిని గుర్తించి వ్యాధిగ్రస్తులకు సకాలం లో మందులు పంపిణీ చేసి నయం చేయడంలో రా్రష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా వైద్య ఆరో గ్య శాఖ మొదటి స్థానంలో నిలచింది. అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోను, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే పౌష్టికాహా రం నిమిత్తం ప్రతి నెల రోగులకు అందచేస్తున్న రూ.500ల పంపిణీలో కూడా రాష్ట్రంలో రెండవ స్థానంలో వైద్య ఆరోగ్యశాఖ నిలచింది.

నేడు అవగాహన ర్యాలీ..
క్షయ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రం గద్వాలలో అవగాహన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీత తెలి పారు. ర్యాలీలో కలెక్టర్ శశాంక, ఇన్‌చార్జి డీఎం హెచ్‌వో డాక్టర్ రాజేంద్రకుమార్ తదితర ఉన్నత అధికారులు పాల్గొంటారని తెలిపారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles