తాగునీటి సమస్య రాకుండా చూడండి

Sun,March 24, 2019 01:08 AM

- లైన్‌మెన్, వాచ్‌మెన్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి
- లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- కలెక్టర్ శశాంక
గద్వాల,నమస్తే తెలంగాణ : ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా చూసే బాధ్యత మిషన్ భగీరథ అధికారులపై ఉందని కలెక్టర్ శశాంక చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య ఉందనే ఫిర్యాదులు రాకూడదని సూచించారు. నీటి సమస్య ఉంది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయండి అనే పరిస్థితి జిల్లాలో ఉండకూడదన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 294హాబిటేషన్‌లకు మిషన్ భగీరథ పూర్తి చేసుకుని 1.30 లక్షల కనెక్షన్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. కనెక్షన్‌లు ఇచ్చిన వాటికి ప్రతి రోజూ మంచినీరు సరఫరా అవుతుందా లేదా రోజు ఎన్నిసార్లు ఓవర్‌హెడ్ ట్యాంకులు నింపడం జరుగుతుంది.. ఎంత నీరు సరఫరా చేశాం అనేది లాగ్ బుక్‌లో రాయాలని సహాయ ఇంజనీర్లకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉండి నీరు సరఫరా కాకుండా ఉంటే నిజాయతీగా పై అధికారులకు తెలపాలని దానిని దాచి పెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. అలా చెప్పకుండా ఉండి నీరు సరఫరా కావడం లేదని ఇతరుల ద్వారా లేదా మీడియా ద్వారా తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైన్‌మెన్‌లు, వాచ్‌మెన్‌లతో వాట్సప్ యాప్ గ్రూప్ పెట్టుకోవాలని ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడ కూడ లీకేజీల ద్వారా నీరు వృధా పోవటానికి వీలు లేదన్నారు. లీకేజీ అవుతున్న వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందింగా ఇంట్రా కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 32 హాబిటేషన్లకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 31 ఏప్రీల్ నాటికి మరో 7 పూర్తి చేసీ మే నాటికి మిగిలిన 3 హాబిటేషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్, గ్రిడ్ అధికారి భీమేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles