తీర్పు ఏకపక్షమే

Sat,March 23, 2019 02:54 AM

- తెలంగాణలో 16ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా : అభ్యర్థి రాములు
- అట్టహాసంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోతుగంటి రాములు నామినేషన్
- పాల్గొన్న పార్లమెంట్ పరిధిలోని మంత్రి, ఎమ్మెల్యేలు

నాగర్‌కర్నూల్ టౌన్ : ఈ సారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రజలు ఏకపక్షంగా అభ్యర్థి పోతుగంటి రాము లును గెలిపిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి పోతుగంటి రాములు జిల్లా కలెక్టరెట్ కా ర్యాలయం లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ మే రకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శ్రీధర్‌కు అందజేశారు. పార్లమెంట్ పరిధిలోని మంత్రి సింగిరె డ్డితోపాటు ఆరు నియోజకవర్గాలకు చెం దిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఢిల్లీలో అధికారి ప్ర తినిధి మంద జగన్నాథం వెంటరాగా డీకే ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి రాములు ర్యాలీ గా వచ్చి అట్టహాసంగా నామినేషన్ వేశారు.

అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసిన పోతుగంటి రా ములు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ వేయడం సంతోషంగా ఉం దన్నారు. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోని ప్రజానికం అంతాకూడా రాము లు గెలుపును స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల మెజార్టీకంటే అత్యధిక మెజార్టీతో రాములును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్నారు. పార్లమెంట్ అభ్యర్థికి ఏకపక్షమైన తీర్పు ఇస్తామని ప్రజలు ముందుకు వచ్చి చెబుతున్నారన్నారు. రాములు గెలుపు కేసీఆర్ మీద, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన ఉన్న నమ్మకంతో ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకొని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి : అభ్యర్థి రాములు
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉం డి అభివృద్ధికి కృషి చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధిష్టానం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపడం అదృష్టంగా భావిస్తున్నానని, నా అభ్యర్థిత్వానికి మద్ధతు తెలిపిన ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యక కలిగిన ఎన్నికలు అ న్నారు. ప్రజల పక్షాన పరిపాలన జరగాలనే ఉద్దేశ్యంతో మా నాయకుడు కేసీఆర్ కేంద్రంలోనూ చురుకైన పాత్ర పోషించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలను యావత్ భారతదేశంలో కొనసాగించే విధంగా ఉండాలని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికుడిగా తాను ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి పాటుపడుతానన్నారు. కార్యక్రమంలో అభ్యర్థితోపాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, డాక్టర్ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్, ఏడు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు విజితారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles