భక్తి పారవశ్యం

Sat,March 23, 2019 02:50 AM

అడ్డాకుల : దక్షిణ కాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం రాత్రి 3:30 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) కన్నుల పండువగా సాగింది. శుక్రవారం ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రథోత్సవం అనంతరం భక్తులు కోనేరులో స్నానమాచరించి రామలింగేశ్వరుని ఆలయం చుట్టూ ఉన్నటువంటి కల్పవృక్షాలకు ప్రదక్షిణ చేసి ముడుపులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవానికి ముందు స్వామి వారికి పూజారులు మహా మంగళహారతిని ఇచ్చి కొత్త కుండలలో అన్నం వండి రథం ముందు మహోకుంభాన్ని పోశారు. గురువారం రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దేవాలయ ప్రాంగణం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై అలంకరించి రథోత్సవాన్ని నిర్వహించారు. హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రామలింగేశ్వరుని రథోత్సవాన్ని చూడటానికి మండల కేంద్రంలోని గ్రామాల నుంచే కాకుండా చుట్టు పక్కల మండలాల నుంచి 5వేలకు పైగా భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. దేవాలయ ఆవరణలో రుద్ర హోమం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా దేవాలయ ఆవరణలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అడ్డాకుల, భూత్పూర్, మూసాపేట, దేవరకద్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువైనందువలన దేవాలయం అధికారులు స్థానిక సర్పంచ్ శ్రీకాంత్, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ఏప్రిల్ 14 శ్రీరామనవమి వరకు కందూరు జాతర కొనసాగుతుంది. కార్యక్రమంలో ఈవో నర్సింహులు, క్యాషియర్ అనంతశర్మ, నాయకులు తోకల శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, నరేందరాచారి, తిరుపతయ్యయాదవ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles