గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయొద్దు

Sat,March 23, 2019 02:50 AM

ఇటిక్యాల : గత ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం కాకుండా పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించి మంచి పేరును తీసుకు రావాలని పీవో, ఏపీవోలకు కలెక్టర్ శశాంక సూచించారు. మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా కొట్టం భీ-ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఇటిక్యాల, అల్లంపూర్, ఐజ మండలాలకు చెందిన 275 మంది పీవో, ఏపీవోల పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్నికల నిర్వహణలో వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్, యంత్రాలు, వీవీ ప్యాట్‌లను గత అసెంబ్లీ ఎన్నికల నిర్వహించడంలో పీవో, ఏపీవోలు చేసిన చిన్నిచిన్న తప్పులు వల్ల ఏవిధంగా ఇబ్బందులను పడ్డామో వారికి వివరించారు. ముఖ్యంగా గత ఎన్నికలలో (సీఆర్‌సీ) క్లోజ్, రిజల్ట్, క్లియర్‌ను సరిగా చేయకపోతే గెలిచిన వారితో ఇబ్బందులు రావన్నారు. కానీ ఓడిపోయిన వారితో చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఉత్పన్నమవు తాయన్నారు. అయితే ఎన్నికలలో స్వల్ప మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా ఈ సమస్య మరింత పెద్దదవుతుందన్నారు. అదృష్టవ శాత్తు గత ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు భారీ మెజార్టీ నమోదు కావడం చేత పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు.

ఒకటికి రెండు సార్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు పవర్ కనెక్ట్ అయ్యిందా లేదా అని సరిచూసుకున్న తర్వాతనే వాటి పనితీరుపై ఒక అభిప్రాయానికి రావాలన్నారు. అలాగేగె మాక్ పోలింగ్ స్లిప్‌లను వీవీ ప్యాట్‌ల నుంచి బయటకు తీయాలన్నారు. గతంలో ఈ నియోజక వర్గంలో 255 పోలింగ్ స్టేషన్‌లు ఉంటే 34 పోలింగ్ స్టేషన్‌లు పెరిగి 289 అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో రాములు నోడల్ అధికారి ఆదిత్య కేశవసాయి, సీపీవో వెంకట రమణ, ఏడు మండలాల తహసీల్దార్లు, ఇటిక్యాల ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి, ఎంఈవో రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles