ఎన్నికల నిర్వహణలో..అధికారుల పాత్ర కీలకం

Sat,March 23, 2019 02:49 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : పార్ల మెంట్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులే కీలక మని, వారు ఎంత మంచిగా విధులు నిర్వహిస్తే ఎన్నికలు అంత ప్రశాంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుం దని, కావున ప్రిసైడింగ్ అధికారులు వారికి ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే నివృత్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం గద్వాల అంసెబ్లీ నియోజక వర్గంలోని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మొదటి స్థాయి ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు 95 శాతం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం వల్లే ఎన్నికలు విజయవంత మయ్యాయని చెప్పారు. అయితే మిగిలిన 5 శాతం అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అధికారులందరూ ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందన్నారు. అందులో ముఖ్యంగా ఫారం-17, 17-సి సరిగ్గా పూరించకపోవడం మాక్‌పోల్ స్లిప్‌లను వీవీ ప్యాట్‌ల నుంచి తొలగించక పోవడం, పీవో డైరీ సరిగా రాయక పోవడం కొంత మంది సీఆర్‌సీ చేయక పోవడం, సీల్ సరిగా వేయక పోవడంతో పాటు ప్రారంభంలోనే ఈవీఎంల కనెక్షన్లు సరిగా ఇవ్వక పోవడం వల్ల అవి పని చేయలేదని మార్చడం వంటి తప్పులు చేయడం జరిగిందన్నారు. అందువల్లనే ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వచ్చిందన్నారు. వీవీ ప్యాట్‌ల లోని స్లిప్‌లు లెక్కించాల్సి వచ్చిందన్నారు. అందువల్ల ఈ సారి అలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఇక్కడే థియరీతో పాటు ప్రాక్టికల్ చేయించాలనే ఉద్దేశంతో మెటీరియల్ తెప్పించడం జరిగింద న్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రాక్టికల్ చేసి చూడాలన్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మాస్టర్ ట్రైనర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాల న్నారు. ముఖ్యంగా ఫారం-17లో మొత్తం ఎన్ని ఓట్లు పోలు అయ్యాయి, అందులో స్త్రీలు ఎంత మంది, పురుషులు ఎంత మంది అనే విష యాలతో పాటు దివ్యాంగులు ఎంత మంది ఓట్లు వేశారనే విషయాలు కచ్చితంగా గుర్తించాలన్నారు. అప్పుడే ఫారం-17, 17-సి పీవో డైరీ సరిపోయిందా లేదా చూసుకునే అవకాశం వస్తుందన్నారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రెండో స్థాయి శిక్షణలో మారోసారి నివృత్తి చేసు కోవాలని సూచించారు. అదే విధంగా ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనందరం చెబుతూనే ఎన్నికల సిబ్బంది తమ ఓటు వేయక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగీ కచ్చితంగా పోస్టల్ బ్యాలట్‌పై ఫారం-12 లేదా, 12-ఏను పూరించి తప్పకుండా ఇవ్వాలన్నారు. నాగర్ కర్నూల్ నియోజక వర్గ పరిధిలో ఓటు ఉంటే ఫారం-12ఏ ఇవ్వాలని, ఇతర నియోజక వర్గంలో ఉంటే ఫారం-12 పూరించి ఇవ్వాలన్నారు.

జేసీ నిరంజన్ మాట్లాడుతూ శుక్రవారం గద్వాల నియోజక వర్గంలోని 274 మంది పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన వారికి ఈనెల 24న శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యంగా పీవోలు తమ పీవో డైరీని కరెక్ట్‌గా నిర్వహిం చాలన్నారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అది జరగాలంటే శిక్షణ పూర్తిగా సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles