స్వచ్ఛతకు చేరువలో..

Fri,March 22, 2019 01:12 AM

జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ఉద్యమంలా కొ నసాగుతుంది. పల్లెల్లో ఎవరూ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడాదనే ఉద్దేశ్యంతో కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు జిల్లా నలుమూలలా విస్తృత ప్రచారం చేపట్టారు. ఐసీడీఎస్, హెల్త్, ఐకెపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖలన్నీ సమన్వయంతో జిల్లాలో మ రుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ నెల 31లోగా మొదటి విడతలతో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలెక్టర్ శశాంక నిర్విరామంగా కృషిచేస్తున్నారు. ఏఫ్రిల్ చివరి నాటికి జిల్లా మొత్తాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు తగిన చర్యలు చేపడు తున్నారు.

బహిరంగ మలమూత్ర విసర్జన చేయడమే రోగాలు రావడానికి కారణమనే విషయాన్ని చాటిచెబుతూ ప్రజలను భాగస్వాములను చేస్తూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో ఎక్కడా కూడా బహిరంగా మలమూత్ర విసర్జన చేయకుండా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ శశాంక దృష్టి సారించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛ భారత్‌క మిషన్ ద్వారా నిధులను సమకూర్చి ఇంటింటా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే రూ.12,000 జమచేస్తూ మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్యను పెంచుతున్నారు. 12 మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలు కొనసాగించి ప్రజల్లో అవగాహనలు చేపట్టారు. జిల్లాలోని పంచాయతీరాజ్, డీఆర్‌డీవో అధికారులకు టార్గెట్‌లను విధించి పనులు చేపట్టారు. ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్ జాబితాలో చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మొదటి విడతలో

11,147 మరుగుదొడ్లు
స్వచ్ఛ జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటులో భాగంగా జిల్లా అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా మెత్తాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు విడతల వారీగా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందుకోసం విడతల వారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. మొదటి విడతలో 52 గ్రామ పంచాయతీల్లో 11,147 మరుగుదొడ్లను నిర్మించుకోవాలని అధికారులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా ఇప్పటి వరకు 32 గ్రామపంచాయితీల్లో 5,700 మరుగుదొడ్లను పూర్తి చేశారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇప్పటి వరకు దాదాపుగా రూ.7కోట్లను అధికారులు ఖర్చు చేశారు. ఇక మిగిలిన 5,447 మరుగుదొడ్ల నిర్మాణాలు 50 శాతం పనులు పూర్తి చేసుకొన్నాయి. ఈ నెల 31 వరకు మొదటి విడుత లక్ష్యాన్ని పూర్తి చేసి 57 గ్రామ పంచాయితీలను ఓడీఎఫ్‌గా గ్రామాలుగా ప్రకటించేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా 64,700 మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు 19,230 మరుగుదొడ్లను పూర్తి చేశారు. మిగిలిన 45,471 మరుగుదొడ్లను జిల్లాలోని ఐసీడీఎస్, హెల్త్, ఐకేపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీరాజ్ వంటి 5 శాఖలు సమన్వయం చేసుకొని ఏఫ్రిల్ చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు.

పుష్కలంగా నిధులు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫథకం ద్వారా నిధులను కేటాయించి మరుగుదొడ్ల నిర్మాణాన్ని నెమ్మదిగా చేపట్టేవారు. ఇందుకు సంబంధించిన నిధులు సక్రమంగా లబ్ధిదారులకు అందకపోవడంతో ప్ర జల్లో ఒక రకమైన నిరాశ ఏర్పడింది. దీంతో మ రుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అంతగా ఆ సక్తి చూసేవారు కాదు. కాని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులను చేపట్టారు. నాలుగు విడతల్లో గ్రామపంచాయతీలోని గ్రామాలను ఎంచుకొని నెలరోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో సర్ప ంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీ లు, సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు, విద్యార్థ్థులను, స్వచ్ఛంద సంస్థలను అందరిని భాగస్వాములుగా చేసి కార్యక్రమాన్ని మందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి లబ్ధిదారునికి ఆర్ధిక సహాయం అం దజేసి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు.
అవగాహన కార్యక్రమాలు..
స్వచ్ఛభారత్, మరుగుదొడ్ల నిర్మాణంలో అవగాహన లోపంతో ఉన్న ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు పలురకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని, స్వచ్ఛ యాత్ర కార్యక్రమాల్ని చేపట్టారు. వీటితో పాటు కలెక్టర్ రోజు రెండు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తు న్న సహకారాన్ని వివరిస్తూ బహిరంగ మలమూ త్ర విసర్జన వలన కలిగే నష్టాలను వివరిస్తున్నారు. కళాజాత బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నా రు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు తెలిపే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు..

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles