కులవృతులకు చేయూత

Fri,March 22, 2019 01:09 AM

వడ్డేపల్లి : గొల్ల కురుమలు అర్థికంగా నిలదొక్కుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో 5,447 యూనిట్లు టార్గెట్ చేసుకొని అర్హులకు అధికారులు గొర్రెలను పంపిణీ చేశారు. వడ్డేపల్లి మండలంలో మొదటి విడత లో 1250, రెండో విడతలో 1282, మదాసి కురువలు 2,230లు దరఖాస్తులు చేసుకోగా మొదటి విడతలో 1233, రెండో విడతలో 94 యూనిట్లు మంజూరు చేసి పంపిణీ చేశారు. రాజోళి మండలంలో 2,258 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 221, రెండో విడతలో 54, మాదాసి కురువలకు 51 యూనిట్లు పంపిణీ చేశారు. గొర్రెలను పొందిన లబ్ధిదారులకు గొర్రెలకు దాణా, మందులను కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రామాలకు గొర్రెల మందల వద్దకు పశు వైద్య సిబ్బంది వెళ్లి వైద్యం అందించారు.

కురువ, యాదవ కుటుంబాలకు చెందిన 18 సంవత్సరాలు నిండిన
ప్రతి ఒక్కరిని సొసైటీల్లో సభ్యులుగా చేర్చుకొని ప్రభుత్వం వారీకి విడతల వారీగా గొర్రెల పంపిణీ చేపడుతోంది. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తుంది. ఒక్కో యూనిట్‌కు లక్షా 25 వేలు రూపాయల వ్యయంతో బ్యాంకులతో సంబంధం లేకుండానే పథకం అమలు చేస్తుంది. 25 శాతం (రూ. 31,250) లబ్ధిదారుడు త న వాటాగా చెల్లిస్తే, 75 శాతం ( రూ 93,750) ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
అర్హుల జాబితాలను తయారు చేసి ఉన్నతా ధికారులకు అందజేశాం. రాజోళి, వడ్డేపల్లి మండ లాల్లో 5,747 యూనిట్లు టార్గెట్‌గా పెట్టుకొని అర్హులకు అంద జేస్తున్నాం. గొర్రెలకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అర్హులం దరూ పూర్తి స్థాయిలో పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
-పుష్పలత, పశువైద్యాధికారిణి , వడ్డేపల్లి, రాజోళి మండలాలు
మంజూరు చేయడంలో జాప్యం వద్దు
మొదట్లో కొన్ని కారణాల వల్ల గొర్రెల పథకం లో గొర్రెల కోసం దరఖాస్తులు చేసుకొని మాదాసి కుర్వలు ఆలస్యంగా దరఖాస్తు చేసుకు న్నారు. రాజోళి మండలంలో 2103, వడ్డేపల్లి మండ లం లో 2230 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారికి త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటి వరకు 54యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు.
-కుర్వ పెద్ద సోమన్న, శాంతినగర్
యూనిట్ల పంపిణీ వేగవంతం చేయాలి
గొల్ల, కురవ, యాదవుల సంఘాల అర్హులైన అందరికీ , దరఖాస్తు చేసుకున్న వారందరికీ గొ ర్రెల పంపిణీ వేగవంతం చేయాలి. మొదటి విడు తలో ఎంతోమంది లబ్ధి పొంది ఆర్థికంగా ఎదుగు తున్నారు. అయితే గొర్రెల ఉంచు కునేందుకు షెడ్లు, వసతులు మంజూరు చేయాలి
- అమర్ యాదవ్, యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles