మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Fri,March 22, 2019 01:08 AM

గట్టు : మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు-రాయచూర్ రహదారిపై బలిగెర సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్, స్థానికుల కథనం ప్రకారం.. మిట్టదొడ్డికి చెందిన పెద్ద రామన్న, యేసేపులు పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై మిట్టదొడ్డి నుంచి బలిగెరకు బయలుదేరారు. ఈ క్రమంలో బలిగెరకు కొంత దూరంలో వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న కర్నూలు డిపోకు చెందిన ఏపీ 21 ఏఎస్ 5987 ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్‌పై వెనుక కూర్చున్న పెద్దరామన్న కిందపడి తలకు తీవ్రగాయలై రక్తం పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యేసేపుకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు, మిట్టదొడ్డి గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాస్ సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గద్వాల ప్రాంతీయ దవాఖానకు తరలించి మృతుని సోదరుడు ఇమ్మానియేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు ఎమ్మార్పీఎస్ నాయకుడు ఇమ్మానియేల్ సోదరుడు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles